టాటా పవర్‌తో టెస్లా సంప్రదింపులు - Tesla in talks with Tata Power
close

Updated : 13/03/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా పవర్‌తో టెస్లా సంప్రదింపులు

భారత్‌లో ఛార్జింగ్‌ వసతుల ఏర్పాటుకు

దిల్లీ: భారత్‌లో విద్యుత్తు వాహనాలకు అవసరమయ్యే ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటు నిమిత్తం టాటా పవర్‌తో అమెరికా వాహన దిగ్గజం టెస్లా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. ఇప్పటివరకు ఇరు సంస్థల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ- టీవీ18 వార్తా సంస్థ వెల్లడించింది. ఈ వార్తలపై ఇప్పటివరకు ఇరు సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా.. కర్ణాటకలో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్లాంటు ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


బిగ్‌బాస్కెట్‌లో 63 శాతం వాటా!

సీసీఐ ఆమోదం కోరిన టాటా సన్స్‌

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకుని, నిత్యావసరాలు సరఫరా చేసే బిగ్‌బాస్కెట్‌లో 63.4 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకుకు ఆమోదం తెలపాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను టాటా సన్స్‌ విభాగమైన టాటా డిజిటల్‌ కోరింది. ఇందుకు ఆమోదం లభిస్తే, ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న అమెజాన్‌, వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌, ముకేశ్‌ అంబానీ ఆధీనంలోని జియో మార్ట్‌తో టాటాలు పోటీపడాల్సి వస్తుంది. బిగ్‌బాస్కెట్‌లో చైనా ఇకామర్స్‌ దిగ్గజం అలీబాబాకు ఉన్న వాటాను కొనుగోలు చేయాలన్నది టాటాల ఆలోచన.
* భారత చెల్లింపుల విభాగమైన అమెజాన్‌ పే లోకి రూ.225 కోట్ల నిధులు అందించినట్లు అమెజాన్‌ వెల్లడించింది.
* ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన 5 కోట్ల షేర్లను బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ విక్రయించింది.  
* తమ డ్రైవింగ్‌ స్కూళ్ల ద్వారా ఇప్పటికి 15 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. 2005లో ప్రారంభించిన ఈ స్కూళ్ల సంఖ్య ఇప్పుడు 238 నగరాలలో 492కు చేరింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.890.85 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినట్లు ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది.
* ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ, సీఈఓ పదవికి ఇత్తిర డేవిస్‌ రాజీనామా చేశారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. అయితే కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో ఆయన డైరెక్టర్‌గా చేరనున్నారు. డేవిస్‌ స్థానంలో ప్రస్తుత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సమిత్‌ ఘోష్‌  బాధ్యతలు స్వీకరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని