అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ ట్రేడింగ్‌ను అనుమతించాలి - The Sensex and Nifty should be allowed to trade on all stock exchanges
close

Updated : 20/03/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ ట్రేడింగ్‌ను అనుమతించాలి

ఆర్‌బీఐ వ్యాసం సూచన

దిల్లీ: అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ప్రామాణిక సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీల ట్రేడింగ్‌ను అనుమతించాలని ఆర్‌బీఐ వ్యాసం ఒకటి సూచించింది. గత నెల 24న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో సాంకేతిక సమస్యతో నాలుగు గంటల పాటు ట్రేడింగ్‌ నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సిఫారసు చేసింది. టెలికాం నెట్‌వర్క్‌ లింక్‌లు విఫలం కావడంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని లావాదేవీల క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ బాధ్యతలు చూసే ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్‌ అందుబాటులోకి లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్‌ ఎక్స్ఛేంజీల్లో ఎన్‌ఎస్‌ఈ కూడా ఒకటి. ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్‌ పనిచేయకుండా పోవడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకోవడానికి దారితీసిందని రిజర్వు బ్యాంక్‌ తాజా బులెటిన్‌లో ప్రచురితమైన  వ్యాసం పేర్కొంది. డిజాస్టర్‌ రికవరీ సైట్‌కు కార్యకలాపాలు మార్చడానికి కూడా కుదరకపోవడం మరో ప్రధాన కారణమని తెలిపింది. సరైన సమయంలో సమాచారం, స్పష్టత అంది ఉంటే బీఎస్‌ఈపై ఆన్‌లైన్‌ ట్రేడర్లు అమ్మకాలకు దిగకపోయి ఉండేవారని, మదుపర్లకు భారీ నష్టాలు రాకుండా ఉండేవని వెల్లడించింది. ఈ వ్యాసాన్ని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్రా, ఇతరులు రూపొందించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని