Worldbank: భారత్‌కు భారీ ఆర్థికసాయం - The World Bank has approved a 500 million dollar program to support the Government of India
close

Published : 07/06/2021 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Worldbank: భారత్‌కు భారీ ఆర్థికసాయం

న్యూయార్క్‌: కొవిడ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఆపన్నహస్తం అందించింది ప్రపంచ బ్యాంకు. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకారం అందించేలా 500 మిలియన్‌ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 

5,55,000 ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రపంచబ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ రంగం చాలా ముఖ్యమైంది. దేశ జీడీపీలో 30శాతం వాటా ఈ రంగానిదే. ఎగుమతుల్లోనూ 40 శాతం ఇక్కడి నుంచే. అయితే కొవిడ్‌ కారణంగా ఈ రంగం  తీవ్రంగా కుదేలైంది. దీంతో ఎంఎస్‌ఎంఈల బలపేతం కోసం భారత్‌కు అండగా నిలిచేందుకు 500 మిలియన్‌ డాలర్లతో RAMP(రైజింగ్‌ అండ్‌ ఆక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పర్ఫామెన్స్‌) కార్యక్రమాన్ని చేపడుతున్నాం’’అని వరల్డ్‌ బ్యాంక్‌ ఇండియా డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలనుకుంటున్నాం అని ఆయన తెలిపారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని