కీలక రేట్లు యథాతథమే! - The key rates are the same
close

Updated : 05/04/2021 08:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీలక రేట్లు యథాతథమే!

కొవిడ్‌-19 కేసుల ప్రభావం

విశ్లేషకుల అంచనా

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. దేశంలో కొవిడ్‌-19 కేసులు ఒక్కసారిగా విజృంభించడం, రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని దాదాపు 4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం సూచించడం ఇందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ కీలక రేట్లను నిర్ణయించే ద్రవ్య పరపతి కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ నిర్ణయాలు 7న వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (+2 లేదా -2 మార్జిన్‌తో) వద్ద అదుపులో ఉంచాలన్న ప్రధాన లక్ష్యాన్ని విడిచిపెట్టకుండానే వృద్ధికి ఊతమందించేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను ప్రకటించేందుకు ఆర్‌బీఐ సరైన సమయం కోసం ఎదురుచూడొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
సర్దుబాటు ధోరణి కొనసాగొచ్చు
ప్రస్తుతం స్వల్పకాలిక రుణ రేటు అయిన రెపో రేటు 4 శాతం; రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. ఆర్థిక రికవరీ ఇప్పటికీ అసంబద్ధంగానే ఉందని, కనిష్ఠాల నుంచి వృద్ధి బలంగా పుంజుకున్నప్పటికీ ఇంకా నెమ్మదిగానే పెరుగుతుందని ఎడెల్‌వైజ్‌ రీసెర్చ్‌ తెలిపింది. తాజాగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల రూపంలో మరో సవాల్‌ ఎదురైందని వెల్లడించింది. దీంతో ఆర్‌బీఐ సర్దుబాటు ధోరణి కొనసాగిస్తూనే కీలక రేట్లలో మార్పులు చేయకపోవచ్చని, బహిరంగ మార్కెట్‌ లావాదేవీల(ఓఎంఓలు)పై వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. దేశంలో కొవిడ్‌-19 కేసుల రూపంలో ఆర్‌బీఐ క్లిష్ట పరిస్థితుల మధ్య నడుస్తోందని, ఆర్థిక రికవరీకి ఇవి అడ్డుకట్ట వేసి..ద్రవ్యోల్బణ రేటు పెరిగేందుకు కారణమవ్వొచ్చని హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ అన్నారు. గృహ రుణ రేట్లు చరిత్రాత్మక కనిష్ఠాలకు చేరాయని, ఇవి పరిశ్రమకు, ఆర్థిక వ్యవస్థకు దోహదపడొచ్చని తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని