మీడియా రంగం ముందుకే - The media sector is ahead
close

Published : 06/05/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీడియా రంగం ముందుకే

కొవిడ్‌-19 అవరోధాలున్నా వృద్ధికి అపార అవకాశాలు
 
సంస్థల అధినేతల ఆశాభావం

దిల్లీ: భారత్‌లో మీడియా రంగ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆ రంగ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 సృష్టించిన అవరోధాలతో సంబంధం లేకుండా ఈ రంగం రాణిస్తుందని అభిప్రాయపడ్డారు. 2020లో టీవీ ప్రకటనల ఆదాయం 25 శాతం మేర తగ్గింది. అయినప్పటికీ వృద్ధిపై సానుకూల దృక్పథంతోనే ఉన్నామని ఆసియా వీడియో ఇండస్ట్రీ అసోసియేషన్స్‌ నిర్వహించిన ఓ సమావేశంలో తెలిపారు. స్థానిక విపణులకు తగ్గట్లుగా కంటెంట్‌ రూపకల్పన, ధరల నిర్ణయం ద్వారా దేశీయంగా విస్తరణపై దృష్టి పెట్టామని డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ రేయాన్‌ తెలిపారు. ‘అందరికీ ఒకటే రకమైన కంటెంట్‌ నచ్చుతుందనే విషయాన్ని మేం అంగీకరించం. ఎందుకంటే భారత్‌లోనే పలు రకాల భారత్‌లు ఉంటాయ’ని అన్నారు. వైవిధ్యభరితమైన కంటెంట్‌, ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సౌత్‌ ఏషియా ఫర్‌ డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ ఇండియా ఎండీ మేఘా టాటా వెల్లడించారు. భారత్‌లో టీవీ చందాల చెల్లింపులు విలువపరంగా, సంఖ్య పరంగా పెరుగుతాయని మీడియా పార్ట్‌నర్స్‌ ఏషియా తెలిపింది. ప్రయోగాలకు, స్థానిక అభిరుచులకు భారత ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తున్నారని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ మోనికా షేర్గిల్‌ అన్నారు. ప్రస్తుత దశాబ్దాన్ని వీడియోల దశాబ్దంగా అనడం ఉత్తమమని జీ5 ముఖ్య వ్యాపార అధికారి అర్చనా ఆనంద్‌ వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని