మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్లుబడుల‌కు కొత్త నియమాలు - The new NAV rules
close

Published : 25/12/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్లుబడుల‌కు కొత్త నియమాలు

లిక్విడ్, ఓవ‌ర్‌నైట్ ఫండ్ల పెట్టుబడుల నియ‌మాల్లో ఎటువంటి మార్పు లేదు.

ఫండ్ల నిక‌ర ఆస్తి విలువ (ఎన్ఏవీ) నియమాల‌ను మారుస్తూ సెబీ తాజాగా సర్క్యులార్ జారీచేసింది. జ‌న‌న‌వ‌రి 1 నుంచి పెట్టుబ‌డి చేసిన మొత్తం ఫండ్ హౌస్‌కు (ఏఎంసీ) చేరిన‌ప్పుడే పెట్టుబ‌డుదారుల‌కు ఆరోజు ఎన్ఏవీ ల‌భిస్తుంది. కొత్త నియ‌మాల ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌థ‌కాల యూనిట్ల కొనుగోలు చేసిన రోజు ఎన్ఏవీ ఇప్పుడు వ‌ర్తించ‌దు. ఇప్పుడు స‌మ‌యం, మొత్తంతో ప‌నిలేకుండా నిధులు ఏఎంసీకి చేరిప్పుడే ఎన్ఏవీ పొందుతారు. ఈ కొత్త ఎన్ఏవీ నియ‌మాలు లిక్విడ్, ఓవ‌ర్‌నైట్ ఫండ్ల‌కు వ‌ర్తించ‌వు.

కొత్త‌ ఎన్ఏవీ నియామాలు:
ఈక్విటీ ఫండ్లు:
రూ.2 లక్షల వరకు పెట్టుబడులు:
ప్రస్తుతం రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డిని ఆ రోజులో మధ్యాహ్నం 1 గంటకు ముందు దరఖాస్తు సమర్పించినట్లయితే అదే రోజు ఎన్ఏవీ ల‌భిస్తుంది. అయితే కట్-ఆఫ్ సమయం 1 గంట‌ల‌ తర్వాత పెట్టుబడి దరఖాస్తు చేస్తే, పెట్టుబడిదారుడికి మరుసటి రోజు ఎన్ఏవీ వ‌ర్తిస్తుంది.

రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడులు:
నిధులు ఏఎంసీకి చేరుకున్నప్పుడు పెట్టుబడిదారులకు ఆరోజు ఎన్ఏవీ లభిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు సోమవారం మధ్యాహ్నం 1 గంటల‌కు ముందు ఈక్విటీ ఫండ్‌లో రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టడానికి ఒక దరఖాస్తును సమర్పించారని అనుకుందాం. మరుసటి రోజు పెట్టుబడి మొత్తం మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు చేరితే, మీరు మంగళవారం రోజు ఉన్న‌ ఎన్ఏవీ పొందుతారు.

కొత్త నియమం:
జనవరి 1 నుంచి అన్ని పెట్టుబడులు పరిమాణంతో సంబంధం లేకుండా నిధులు ఏఎంసీకి చేరుకున్నప్పుడు ఆరోజు ఉన్న‌ ఎన్ఏవీని పొందుతాయి.

డెట్‌ ఫండ్లలో రూ.2 లక్షల వరకు పెట్టుబడి:
ప్రస్తుతం, మధ్యాహ్నం 1 గంటకు ముందు ఒక దరఖాస్తు సమర్పించినట్లయితే, పెట్టుబడిదారుడు అదే రోజు ఎన్ఏవీ పొందుతాడు.

రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడి:
మధ్యాహ్నం 1 గంట కట్ ఆఫ్ సమయానికి ముందు సమర్పించిన రూ.2 లక్షలకు పైగా ఏదైనా దరఖాస్తు చేస్తే, నిధులు ఏఎంసీకి చేరిన రోజు ఎన్ఏవీను పొందుతాయి.

లిక్విడ్‌, ఓవ‌ర్‌నైట్‌ పథకాలు కాకుండా డెట్ ఫండ్ల‌ కోసం కొత్త నియమం:
కొత్త నియ‌మాల ప్ర‌కారం పెట్టుబడి పరిమాణంతో సంబంధం లేకుండా నిధులు మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు చేరుకున్నప్పుడు పెట్టుబడిదారుడు ఆరోజు ఎన్ఏవీ పొందుతాడు.

లిక్విడ్ ఫండ్స్ , ఓవర్‌నైట్‌ ఫండ్స్:
ప్రస్తుతం, ఈ కేటగిరీ డెట్‌ పథకాలకు కట్-ఆఫ్ సమయం మధ్యాహ్నం 12:30 గంటలు. నిధులు ఏఎంసీకి చేరుకున్నప్పుడు పెట్టుబడిదారుడు ఆరోజు ఎన్ఏవీ పొందుతాడు.

కొత్త నియమం:
లిక్విడ్‌, ఓవ‌ర్‌నైట్ ప‌థ‌కాల‌ కోసం నిబంధనలలో మార్పు లేదు. పాత‌ నియమాలే లిక్విడ్, ఓవ‌ర్‌నైట్ ఫండ్ల‌కు వర్తిస్తాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని