మూలధన సేకరణకు తక్షణ ప్రణాళికలేమీ లేవు - There are no immediate plans for raising capital
close

Published : 08/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూలధన సేకరణకు తక్షణ ప్రణాళికలేమీ లేవు

 ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు ఆర్జించిన నేపథ్యంలో, మూలధన సమీకరణ కోసం తక్షణ  ప్రణాళికలు ఏమీ రూపొందించల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు. వ్యాపార వృద్ధికి ఆ మొత్తాన్నే వినియోగిస్తామని పేర్కొన్నారు. ‘గతంలో టైర్‌-1, టైర్‌-2 బాండ్ల ద్వారా నిధులు సమీకరించాం. గత ఏడాది వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే, సౌకర్యవంతమైన మూలధన కనీస నిష్పత్తి ఉంది. ఈ ఏడాదిలో వ్యాపార వృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయ’ని దినేశ్‌ వెల్లడించారు.
* ఎస్‌బీఐ లైఫ్‌లో కార్లిలే గ్రూప్‌ 4% వాటా విక్రయం
ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లిలే గ్రూప్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో తమకున్న 4 శాతం వాటాను రూ.3,900 కోట్లకు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. బీఎస్‌ఈ వద్ద ఉన్న సమాచారం మేరకు, కార్లిలే గ్రూప్‌ తమ సీఏ ఎమరాల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా 4.1 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను విక్రయించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని