IPO : రానున్న రెండు నెలల్లో ఐపీఓల జాతర - Thirty cos may float public issues in Oct Nov
close

Published : 26/09/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPO : రానున్న రెండు నెలల్లో ఐపీఓల జాతర

దిల్లీ : గతకొంత కాలంగా మార్కెట్లలో ఐపీఓల జోరు కొనసాగుతోంది. రానున్న రెండు నెలల్లోనూ భారీ ఎత్తున కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు-నవంబరులో కనీసం 30 కంపెనీలు ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు రూ.45,000 కోట్ల సమీకరణ జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఐపీఓకి రానున్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగానికి చెందినవేనని తెలుస్తోంది. ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో టెక్‌ ఆధారిత కంపెనీలన్నీ పబ్లిక్ ఇష్యూ వైపు అడుగులు వేస్తున్నాయి.

రానున్న రెండు నెలల్లో ఐపీఓకి రానున్న కంపెనీల జాబితాలో పాలసీబజార్(రూ.6,017 కోట్లు)‌, ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌(రూ.4.500 కోట్లు), నైకా(రూ.4,000 కోట్లు), సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌(రూ.2,000 కోట్లు), మొబిక్విక్‌ సిస్టమ్స్‌(రూ.1,900 కోట్లు), నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌(రూ.1,800 కోట్లు), ఇక్సిగో(రూ.1,600 కోట్లు), సఫైర్‌ ఫుడ్స్‌(రూ.1,500 కోట్లు), ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ (రూ.1,330 కోట్లు), స్టెరిలైట్‌ పవర్‌ (రూ.1,250 కోట్లు), రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ (రూ.1,200 కోట్లు), సుప్రియా లైఫ్‌ సైన్స్‌ (రూ.1,200 కోట్లు) కంపెనీలు ఉన్నాయి.

కరోనా మహమ్మారి రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకోవడమే కంపెనీలు ఐపీఓకి రావడానికి కారణమని ప్రముఖ ఆన్‌లైన్‌ స్టాక్ బ్రోకింగ్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి రాయ్‌ తెలిపారు. అలాగే ఎఫ్‌పీఐ, డీఐఐల వెల్లువ, రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పుంజుకోవడం కూడా ఐపీఓలకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ స్టాక్‌ మార్కెట్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది కూడా ఐపీఓల పరంపర కొనసాగుతుందని ఇన్వెస్ట్‌19 సీఈఓ కౌశలేంద్ర సింగ్‌ సెంగార్‌ తెలిపారు.

2021లో ఇప్పటి వరకు దాదాపు 40 కంపెనీలు ఐపీఓ పూర్తిచేసుకున్నాయి. రూ.64,217 కోట్లు సమీకరించాయి. ఈ నెల 29న ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ రూ.2,778 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకి సిద్ధంగా ఉంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని