IRCTC: ఈ స్టాక్ 6 నెలల్లో 293 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది! - This stock zooms 293pc in 6 months
close

Updated : 19/10/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IRCTC: ఈ స్టాక్ 6 నెలల్లో 293 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది!

ముంబయి: బీఎస్‌ఈలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో ‘ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)’ చేరింది. మంగళవారం ఈ కంపెనీ షేరు విలువ ఓ దశలో 8 శాతం పెరిగి రూ.6,332.25కు చేరడంతో ఈ ఘనత సాధించింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో షేరు ధర ఏకంగా 33 శాతం ఎగబాకడం విశేషం. ప్రస్తుతం బీఎస్‌ఈలో రూ.1,00,612 కోట్లతో ఈ సంస్థ మార్కెట్‌ విలువ పరంగా 57వ స్థానంలో ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వంటి సంస్థలను వెనక్కి నెట్టింది.

ఆరు నెలల క్రితం రూ.1,612 వద్ద ఉన్న ఈ కంపెనీ షేరు విలువ ఏకంగా 293 శాతం ఎగబాకడం విశేషం. ఇదే సమయంలో బీఎస్ఈ సూచీ 30 శాతం పెరిగింది. ఆగస్టు నుంచి పరిశీలిస్తే ఈ షేరు ధర దాదాపు రెండింతలైంది. షేరు ధర భారీ ఎత్తున పెరగడంతో రిటైల్‌ మదుపర్లకు దీన్ని అందుబాటులో ఉంచేలా స్టాక్‌ స్ప్లిట్‌ చేయాలని కంపెనీ నిర్ణయించింది. రైల్వేలో క్యాటరింగ్‌, టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌.. వంటి సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. టికెట్‌ బుకింగ్‌లో 73 శాతం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌లో 45 శాతం వాటా ఐఆర్‌సీటీసీదే.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని