close

తాజా వార్తలు

బడ్జెట్‌: ఆ మూడు ఏమిటో తెలుసా..!

 ఆర్థిక మంత్రిని ప్రభావితం చేసే అంశాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక మంత్రి బాధ్యతలు కత్తిమీద సాముతో సమానం. బడ్జెట్ నిర్ణయాలను ప్రకటించే క్రమంలో ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా.. ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. అవి దేశీయ అంశాలు మాత్రమే కానవసరంలేదు.. అంతర్జాతీయ అంశాలను విస్మరించినా మన ఎగుమతులు.. దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత్‌ ఎగుమతుల కంటే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే మనకు కీలక సరుకులు సరఫరా చేసే దేశాలు, అక్కడి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తీవ్ర ఆర్థిక సమస్యల మధ్య రెండో సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌కు ఈ సారి ప్రపంచ స్థాయి సమస్యలు కూడా తలనొప్పిగా మారాయి.

చమురు ధరలపై ఆందోళన..

భారత్‌ 80శాతం చమురు అవసరాలు దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ చమురు ధరలను శాసిస్తున్నాయి. చమరు ధరలు పెరిగే కొద్దీ మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతుంటాయి.. దీంతోపాటు వాణిజ్యలోటు కూడా పెరిగిపోతుంటుంది. ఇప్పటికే చమురు ధరలపై  నియంత్రణను ప్రభుత్వం తగ్గించుకోవడంతో నేరుగా ప్రజలపైనే ప్రభావం చూపుతున్నాయి. పెరిగే ధరలు ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తాయి. ఇంధన ధర అంతర్జాతీయంగా 10 డాలర్లు పెరిగితే దేశ జీడీపీ 0.2-0.3శాతం పడిపోతుందని 2017-18లో లెక్కగట్టారు. ద్రవ్యోల్బణం 1.7శాతం పెరుగుతుంది. కరెంటు ఖాతా లోటు 9 నుంచి 10 బిలియన్‌ డాలర్ల వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఇంధన అవసరాలు మరింత పెరిగాయి.. అంటే వీటి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్మలా సీతారమన్‌ చమురుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

వాణిజ్య ఉద్రిక్తతలు..

ట్రంప్‌ పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలను కూడా ఆర్థిక మంత్రి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ఇటీవల చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినా దీని అమలు కూడా కీలకమై.. ఏమైనా సమస్యలు తలెత్తినా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ క్రమంలో భారత్‌ విదేశీ కంపెనీలను ఆకర్షించేలా పాలసీలు తయారు చేసుకోవాలి. మరోపక్క ట్రంప్‌ గురిలో భారత్‌ కూడా ఉంది. ఆయన తరచూ భారత్‌ ఆర్థిక విధానాలపై విమర్శలకు దిగడం గమనార్హం. ట్రంప్‌ వంటి దుందుడుకు వ్యక్తి వీటిని  ఏ క్షణానైనా పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎగుమతులు ప్రభావితం అయితే భారత్‌లోని ఉద్యోగాలు.. పన్ను ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రపంచ సంస్థలు..

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో భారత్‌, చైనాలకు అభివృద్ధి చెందుతున్న దేశాల హోదా పై అమెరికా అభ్యంతరాలు కీలకంగా మారనున్నాయి. ఈ హోదా పోతే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు పడిపోయి మరింత ఘోరంగా తయారవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే డబ్ల్యూటీవో అప్పిలేట్‌ బాడీలో నియామకాలను అడ్డుకొని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌కు అభివృద్ధి చెందుతున్న దేశం హోదా పోతే.. ఎటువంటి రాయితీలు లేకుండా మిగిలిన దేశాలతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.