ఉద్యోగాలు నిలిచేందుకు భారత్‌మరిన్ని చర్యలు చేపట్టాల్సింది - To protect the jobs India would have taken some more steps
close

Published : 07/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగాలు నిలిచేందుకు భారత్‌మరిన్ని చర్యలు చేపట్టాల్సింది

మెకిన్సే అండ్‌ కంపెనీ అధికారి

ముంబయి: కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాలు పోకుండా భారత్‌ మరిన్ని చర్యలు చేపట్టి ఉండాల్సిందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్‌ కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘బ్రిటన్‌ విషయానికొస్తే పేరోల్‌ పరిరక్షణ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలను సమర్థంగా కాపాడింది. అమెరికా కూడా అంత సమర్థంగా వ్యవహరించలేదు. భారత్‌ కూడా ఉద్యోగాలను కాపాడడానికి మరిన్ని చర్యలు చేపట్టి ఉండాల్సింద’ని కంపెనీ సీనియర్‌ పార్టనర్‌ అలోక్‌ క్షీర్‌సాగర్‌ పేర్కొన్నారు. కరోనా సమయంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో నిరుద్యోగం రికార్డు స్థాయిలకు చేరుకుంది. ఆయా రంగాల నుంచి మొండి బకాయిలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీలు అంతర్గతంగా ఇటువంటి ఉపద్రవాలను తట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని.. అందుకు తగ్గట్లుగా పెట్టుబడులూ పెట్టాలని క్షీర్‌సాగర్‌ సూచించారు. సరఫరా వ్యవస్థలు, పంపిణీదార్ల సంబంధాలు, మూలధన పరిమితులపైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. ఇవన్నీ సరైన పెట్టుబడులే అని రేటింగ్‌ ఏజెన్సీలు, ఈక్విటీ విశ్లేషకులు, పెట్టుబడిదార్లకు వివరించవచ్చని తెలిపారు. పనితీరు విషయంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలన్నీ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నవేనని.. అందులో బ్యాంకింగ్‌, ఐటీ, వాహన రంగాలున్నాయని వివరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని