పాలసీబజార్‌కు బీమా బ్రోకింగ్‌ లైసెన్సు - To the policybazaar Insurance Broking‌ License
close

Published : 12/06/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాలసీబజార్‌కు బీమా బ్రోకింగ్‌ లైసెన్సు

దిల్లీ: బీమా వెబ్‌ అగ్రిగేటర్‌గా సేవలనందించిన పాలసీబజార్‌.కామ్‌ ఇక నుంచి బీమా బ్రోకర్‌గా మారనుంది. తమకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి లైసెన్సు లభించినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ఉన్న వెబ్‌ అగ్రిగేటర్‌ లైసెన్సును ఐఆర్‌డీఏఐకి స్వాధీనం చేసినట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా బీమా బ్రోకర్‌ లైసెన్సు కోసం ప్రయత్నిస్తున్నట్లు పాలసీబజార్‌.కామ్‌ సీఈఓ యాశిష్‌ దాహియా తెలిపారు. ఈ లైసెన్సు రావడంతో ఇప్పుడు పాలసీబజార్‌ క్లెయింలలో సహాయం, ఆఫ్‌లైన్‌ సేవలు, నెట్‌వర్క్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. వెబ్‌ అగ్రిగేటర్లుగా ఉండటంతో పాలసీల పునరుద్ధరణ సమయంలో బీమా సంస్థలు కమీషన్‌ ఇవ్వడం లేదని, ఇప్పుడు ఆ ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు. బ్రోకింగ్‌ లైసెన్సును  సమర్థంగా వినియోగించుకుని, మరిన్ని అదనపు సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. జీవిత బీమా పాలసీల విక్రయంలో పాలసీబజార్‌కు 25శాతం, ఆరోగ్య బీమా పాలసీల్లో 10శాతం వాటా ఉంది. 2018లో యూనికార్న్‌ హోదా సాధించిన ఈ సంస్థ పైసాబజార్‌.కామ్‌ను కూడా నిర్వహిస్తోంది.

సీజీ పవర్‌ లాభం రూ.294 కోట్లు

దిల్లీ: మార్చి త్రైమాసికంలో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.294.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.288.06 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.636.67 కోట్ల నుంచి రూ.1134.58 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం రూ.393.97 కోట్లకు తగ్గింది. 2019-20లో ఇది రూ.2166.94 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.5158.01 కోట్ల నుంచి రూ.3065.87 కోట్లకు చేరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని