పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్లు ఉండాలి? - Too-many-schemes-could-dilute-your-portfolio
close

Published : 06/08/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్లు ఉండాలి?

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు గ‌త కొన్ని సంవ‌త్స‌రాల్లో గ‌ణ‌నీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఈ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన త‌ర్వాత లాక్‌డౌన్ కాలంలో  ప్ర‌జ‌లు కొంత ఆర్థిక విష‌యాల‌పై దృష్టి పెట్ట‌డంతో మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులుకు మొగ్గుచూపుతున్నారు. ఇది చాలా మంచి ప‌రిణామం, కానీ దానికోసం ఏదో ఒక ప‌థ‌కం ఎంచుకొని దానిలో పెట్ట‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. పోర్ట్‌ఫోలియోలో చాలా మ్యూచువ‌ల్ ఫండ్ స్కీములు ఉంటే అవి మీ పెట్టుబ‌డుల‌ను దెబ్బ‌తీస్తాయి. వాటి నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మైపోతుంది. రాబ‌డి కూడా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. 

 మొద‌ట మీకు ఆర్థిక ల‌క్ష్యాల‌పై స్పష్ట‌త ఉండాలి. మీకు ఉన్న ల‌క్ష్యాల‌కు ఎంత స‌మ‌యం ఉంది దాని ప్ర‌కారం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అంచ‌నా వేయాలి. దాని ప్ర‌కారం ఎంత కాలానికి ఎంత మేర‌కు పెట్టుబ‌డులు పెట్టాల‌నే విష‌యాన్ని ఆన్‌లైన్ సిప్ క్యాలిక్యులేట‌ర్ ద్వారా తెలుసుకోవాలి. ఆర్థిక ల‌క్ష్యాలు అంటే ఉదాహ‌ర‌ణ‌కు కారు కొన‌డం, ఇంటి రుణం లేదా వ్యాపారం కోసం రుణం అన‌కుంటే డౌన్‌పేమెంట్ల‌తో స‌హా లెక్కించాలి. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల విష‌యానికొస్తే పిల్ల‌ల చ‌దువు లేదా పెళ్లి కోసం, ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి ఇలా అన్ని ఆర్థిక ల‌క్ష్యాలు, కాల‌ప‌రిమితి త‌గిన పెట్టుబ‌డుల‌ను అంచ‌నా వేయాలి. 

 పెట్టుబ‌డులు మీ రిస్క్ సామర్థ్యం , కాల‌ప‌రిమితి ఆధారంగా ఉండాలి. దీనికోసం వ్యూహం, త‌గిన ప్ర‌ణాళిక అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు 5 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం పట్టే ఆర్థిక ల‌క్ష్యాల కోసం ఈక్విటీల్లో పెట్టుబ‌డులు పెట్టాలి. దీంతో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి లాభం పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అదే మూడేళ్లు లేదా అంత‌కంటే త‌క్కువ కాలం కోసం అయితే డెట్ ఫండ్లు మంచివ‌ని నిపుణుల స‌ల‌హా. ఇందులో క్యాపిట‌ల్ రిస్క్ త‌క్కువ ఉండ‌టంతో పాటు లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది. 

కొన్నిసార్లు మంచి ప‌థ‌కం అని అంచ‌నా వేసి తీసుకున్న‌ప్ప‌టికీ వ‌రుస‌గా రెండు మూడేళ్ల‌పాటు ప‌నితీరు బాగాలేని ఫండ్లు ఉంటాయి. దానికి కార‌ణం తెలుసుకొని ఇత‌ర వాటితో పోల్చి చూసి అటువంటి ఫండ్ల‌ను పోర్ట్‌ఫోలియో నుంచి తీసీవేయాలి.  వాటిని అధేవిధంగా కొన‌సాగిస్తే లాభం లేక‌పోవ‌డంతో పాటు వ‌చ్చే రాబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. 

  మీ ఆర్థిక ల‌క్ష్యాల‌పై స‌రైన స్ప‌ష్ట‌త వ‌చ్చాక కేటాయింపు వ్యూహాన్ని మార్చి పోర్ట్‌ఫోలియోను పున‌ర్నిర్మించాలి. ఆర్థిక ల‌క్ష్యాల‌కు సరిప‌డేలా పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాల‌ని నిపుణులు చెప్తున్నారు. అయితే మ‌రీ ఎక్కువ‌గా వైవీధ్యీక‌రించ‌డం కూడా మంచిది కాదు. దాంతో ఫండ్ల ప‌నితీరును ట్రాక్ చేయ‌డం చాలా క‌ష్టం అవుతుంది.  ఏడాదిలో ఒక‌సారైనా పోర్ట్‌ఫోలియో స‌మీక్షించుకోవాలి. ఈ విధంగా పెట్టుబ‌డుల‌ను రీబ్యాలెన్స్ చేసుకోవాలి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని