సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మెరుగైన‌ పెట్టుబ‌డి ప‌థ‌కాలు - Top-deposit-schemes-with-higher-returns-for-conservative-investors
close

Published : 11/06/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మెరుగైన‌ పెట్టుబ‌డి ప‌థ‌కాలు

సాంప్ర‌దాయిక పెట్టుబ‌డిదారుల‌కు అధిక రాబ‌డి ఇచ్చే కొన్ని డిపాజిట్ ప‌థ‌కాలు. భ‌రోసాతో కూడిన వ‌డ్డీ ఆదాయంతో అనేక సుర‌క్షిత‌మైన ఆర్థిక పెట్టుబ‌డులు ఉన్నాయి. మీరు మీ పొదుపుల‌ను స్టాక్ మార్కెట్ నుండి దూరంగా ఉంచాల‌ని చూస్తున్న‌ట్ల‌యితే, ఎంచుకోవ‌డానికి అనేక స్థిర‌-ఆదాయ పెట్టుబ‌డి ఎంపిక‌లు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ, వాటిలో కొన్ని సీనియ‌ర్ సిటిజ‌న్లు లేదా రిటైర్డ్ ఇన్వెస్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక‌మైన‌వి కాబ‌ట్టి అంద‌రికీ అందుబాటులో ఉండ‌వు.  అయిన‌ప్ప‌టికీ, కొన్ని వ‌డ్డీ ఆదాయంతో సుర‌క్షిత‌మైన ఆర్థిక సాధ‌నాలు కొన్ని ఉన్నాయి. వీటికి ప్ర‌భుత్వ హామీ కూడా ఉంది.

అనేక పెట్టుబ‌డులు సాధార‌ణ ఆదాయాన్ని అందిస్తాయి. మ‌రికొన్ని ఇవ్వ‌క‌పోవ‌చ్చు. అదేవిధంగా, కొన్ని పెన్ష‌న్ అవ‌స‌రాల‌కు, మ‌రికొన్ని ప‌న్ను పొదుపుతో రావ‌చ్చు. కొన్ని ఆర్థికంగా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు చేరుకోవ‌డానికి అనుకూలంగా ఉంటాయి. అందులో ముఖ్య‌మైన ప‌థ‌కాలు కొన్ని ఈ క్రింద ఉన్నాయి.

1. ప్ర‌ధాన్ మంత్రి వ‌య వంద‌న యోజ‌న (పీఎమ్‌వీవీవై) ఇందులో పెట్టుబ‌డి పెట్టిన ఆర్థిక సంవ‌త్స‌రాన్ని బ‌ట్టి వ‌డ్డీ రేటు మారుతూ ఉంటుంది. పీఎమ్‌వీవీవై అనేది ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతో 10 ఏళ్ల పెన్ష‌న్ ప‌థ‌కం. 60 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సుగ‌ల రిటైర్డ్ వ్య‌క్తుల‌కు ఈ ప‌థ‌కం స‌రిపోతుంది. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి, పీఎంవీవీవై ప‌థ‌కానికి చెల్లించే వ‌డ్డీ 7.40%. 2022 మార్చి 31 వ‌ర‌కు కొనుగోలు చేసిన అన్ని పాల‌సీల‌కు 10 సంవ‌త్స‌రాల పూర్తి పెన్ష‌న్ రేటు చెల్లించ‌బ‌డుతుంది. ఈ ప‌థ‌కంలో చేసిన పెట్టుబ‌డి మొత్తాన్ని `కొనుగోలు ధ‌ర‌` అంటారు. పెన్ష‌న్ ఎంపిక‌ను బ‌ట్టి (నెల‌వారీ, త్రైమాసిక‌, వార్షికంగా) ఇవ్వ‌బ‌డుతుంది. పీఎమ్‌వీవీవైలో చేయ‌గ‌లిగే గ‌రిష్ట పెట్టుబ‌డి సీనియ‌ర్ సిటిజ‌న్‌కు రూ. 15 ల‌క్ష‌ల‌కు ప‌రిమితం చేయ‌బ‌డింది. గ‌రిష్ట నెల‌వారీ పెన్ష‌న్ సీనియ‌ర్ సిటిజ‌న్‌కు రూ. 9,250.  కాబ‌ట్టి భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ 60 ఏళ్లు పైబ‌డిన‌వారు అయితే, గ‌రిష్టంగా రూ. 30 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 18,500  నెల‌వారీ పెన్ష‌న్ వ‌స్తుంది. ఈ ప‌థ‌కంలో పెన్ష‌న్ పెట్టుబ‌డిదారుడి వ‌య‌స్సుపై ఆధార‌ప‌డి ఉండ‌దు. ఈ ప‌థ‌కాన్ని ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో `ఎల్ఐసీ` వెబ్‌సైట్ నుండి మాత్ర‌మే కొనుగోలు చేయ‌వ‌చ్చు. 2023 మార్చి 31 వ‌ర‌కు ఎల్ఐసీలో అందుబాటులో ఉంటుంది.

2. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020, ఈ బాండ్స్ ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుగ‌ల పెట్టుబ‌డులు, 100% ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. ఎస్‌బీఐ, జాతీయం చేసిన బ్యాంకులు, పేర్కొన్న 4 ప్రైవేట్ రంగ బ్యాంకుల శాఖ‌ల ద్వారా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వీటి కాల‌వ్య‌వ‌ధి 7 సంవ‌త్స‌రాలు. ప‌థ‌కం కాల‌వ్య‌వ‌ధిలో వ‌డ్డీరేటు మారుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం వ‌డ్డీరేటు 7.15 శాతంగా నిర్ణ‌యించ‌బ‌డింది. బాండ్ల‌పై వ‌డ్డీ ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1, జులై 1న అర్ధ వార్షిక వ్య‌వ‌ధిలో చెల్లించ‌బ‌డుతుంది. క‌నీస పెట్టుబ‌డి మొత్తం రూ. 1000 కాగా, ఈ బాండ్ల‌లో చేసిన పెట్టుబ‌డుల‌కు గ‌రిష్ట ప‌రిమితి ఉండ‌దు. న‌గ‌దులో గ‌రిష్ట పెట్టుబ‌డి రూ. 20 వేల వ‌ర‌కు చేయ‌వ‌చ్చు. వ‌డ్డీరేటు ప్ర‌స్తుత ఎన్ఎస్‌సీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్ల వ్యాప్తితో ఉన్న నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) రేటుతో ముడిప‌డి ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల యొక్క నిర్దిష్ట వ‌ర్గాల‌కు పెట్టుబ‌డుల అకాల ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంది.

3. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌) 55 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తి, 60 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వారు అయితే వీఆర్ఎస్ కింద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారు కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాలు అందిన ఒక నెల‌లోనే  ఈ ఖాతా తెర‌వొచ్చు. ఈ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల కాలానికి ఉంటుంది. ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు తెర‌వొచ్చు. కానీ మొత్తం పెట్టుబ‌డి ప‌రిమితి రూ. 15 ల‌క్ష‌లు. సంపాదించిన వ‌డ్డీ పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. అధిక స్థిర రేటు, సాధార‌ణ ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు `ఎస్‌సీఎస్ఎస్` ప‌థ‌కం స‌రిపోతుంది. మెచ్యూరిటీ త‌ర్వాత‌, మెచ్యూరిటీ ముగిసే ఒక సంవ‌త్స‌రం లోపు ఖాతాను మ‌రో 3 ఏళ్లు పొడిగించ‌వ‌చ్చు. ఏప్రిల్ 1 - జూన్ 30, 2021 వ‌ర‌కు ఈ ప‌థ‌కంపై వ‌డ్డీరేటు ఏడాదికి 7.4 శాతంగా ఉంది.

4. అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) ఇది ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌బ‌డిన పెన్ష‌న్ ప్ర‌ణాళిక. భ‌విష్య‌త్తులో సీనియర్లు అయ్యే అసంఘ‌టిత రంగంలో వారికి ఇది మంచి ప‌థ‌కం.  దీనిని `పీఎఫ్ఆర్‌డీఏ` ఎన్‌పీఎస్ అజ‌మాయిషిలో ప‌నిచేస్తుంది. ఈ ప‌థ‌కంలో 18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు చేర‌వ‌చ్చు. నిర్ణీత పెన్ష‌న్ రూ. 1,000, 2,000, 3,000, 4,000, 5,000గా ఉంటుంది. మ‌నం క‌ట్టే వాటా (కంట్రీబ్యూష‌న్‌) మీద ఆధార‌ప‌డి ఉంటుంది. నెల‌కు పెన్ష‌న్ రూ. 5,000 రావాలంటే మ‌నం క‌ట్టే కంట్రీబ్యూష‌న్ 18వ ఏట నుంచి నెల‌కు రూ. 210 చెల్లించాలి. పెన్ష‌న్ 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ప్రారంభ‌మ‌వుతుంది. చందాదారుని మ‌ర‌ణం త‌ర్వాత జీవిత భాగ‌స్వామికి పెన్ష‌న్ ఇవ్వ‌బ‌డుతుంది. జీవిత భాగ‌స్వామి మ‌ర‌ణిస్తే, పెన్ష‌న్ కార్ప‌స్ ఫండ్ అస‌లు చందాదారుల నామినీకి ఇవ్వ‌బ‌డుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని