తొషిబా సీఈవో రాజీనామా - Toshiba CEO resigns
close

Published : 15/04/2021 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొషిబా సీఈవో రాజీనామా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పారిశ్రామిక దిగ్గజం తొషిబా సీఈవో నబౌకి కురుమాతని నేడు పదవికి రాజీనామా చేశారు. సీవీసీ క్యాపిటల్‌ పార్టనర్స్‌ 20 బిలియన్‌ డాలర్ల బిడ్‌ వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. దీంతో కంపెనీ ఛైర్మన్‌ సతోషి త్సునకవ సీఈవో బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నబౌకి రాజీనామాకు కారణాలను  ప్రకటనలో వెల్లడించలేదు. 

గత వారం సీవీసీ సంస్థ తొషిబా ప్రైవేట్‌ను చేజిక్కించుకునేందుకు దాఖలు చేసిన బిడ్‌తో ఆయన రాజీనామా వేగవంతం అయింది. ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కో కూడా దీని కొనుగోలుకు సీవీసీ కంటే ఆకర్షణీయమైన బిడ్‌ను దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. మరో పక్క కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఆఫర్‌ కూడా ప్రాథమిక స్థాయిలో ఉందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఈ వార్తలపై అటు కేకేఆర్‌ కానీ, ఇటు బ్రూక్‌ ఫీల్డ్‌ కానీ స్పందించేందుకు నిరాకరించాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని