Toyota Kirloskar: పెరగనున్న టయోటా కార్ల ధరలు.. ఎప్పటినుంచంటే? - Toyota Kirloskar Hiked prices from Oct 1st
close

Published : 28/09/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toyota Kirloskar: పెరగనున్న టయోటా కార్ల ధరలు.. ఎప్పటినుంచంటే?

దిల్లీ: తమ సంస్థ విక్రయిస్తోన్న అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్ ‌(టీకేఎం) మంగళవారం వెల్లడించింది. ధరలు రెండు శాతం వరకూ ప్రియం కానున్నట్లు తెలిపింది. ఈ పెంపు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ముడి సరకుల ధరలు పెరిగిన కారణంగానే వినియోగదారులపై భారం మోపాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. టీకేఎం నుంచి హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్‌, మల్టీపర్పస్‌ వెహికల్‌ ఇన్నోవా క్రిస్టా, ప్రీమియం అండ్‌ ఎస్‌యూవీ ఫార్చునర్‌ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే పలు సంస్థలు కార్ల ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. అక్టోబరు 1 నుంచి టాటా మోటార్స్‌ తమ కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మారుతీ సుజుకీ సైతం కొన్ని మోడళ్ల ధరను 1.9 శాతం పెంచింది. ద్వి చక్రవాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ ఈ ఏడాది ఏకంగా మూడుసార్లు ధరల్ని సవరించింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని