అన్‌అకాడమీ అదుర్స్‌.. భారత అంకురాల్లో అగ్రస్థానం - Unicorns Unacademy Udaan CRED top 2021 LinkedIn Top Startups India list
close

Published : 23/09/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్‌అకాడమీ అదుర్స్‌.. భారత అంకురాల్లో అగ్రస్థానం

ఉడాన్, క్రెడ్‌కు 2, 3 ర్యాంకులు

దిల్లీ: దేశీయ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అన్‌అకాడమీ 2021 సంవత్సరానికి లింక్డ్‌ఇన్‌ రూపొందించిన భారత అగ్రశ్రేణి అంకురాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బి2బి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఉడాన్, ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ మూడూ యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువైనవి)లే. 2020 జులై నుంచి 2021 జూన్‌ మధ్యకాలంలో ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీతో ఉద్యోగుల సంబంధాలు, ప్రతిభను వెలికితీయడం అనే 4 ప్రధాన అంశాల ఆధారంగా లింక్డ్‌ఇన్‌ ఈ అంకురాల జాబితా రూపొందించింది. ఇందులో అర్హత సాధించాలంటే కంపెనీకి 7 ఏళ్ల అనుభవం, కనీసం 50 మంది ఉద్యోగులు, దేశీయంగా ప్రధాన కార్యాలయం ఉండాలన్న నిబంధనలు పాటించింది.

అన్‌అకాడమీ 344 కోట్ల డాలర్ల విలువతో తొలి ర్యాంకును సాధించింది. ఉడాన్‌ (2), క్రెడ్‌ (3), అప్‌గ్రేడ్‌ (4), రేజర్‌పే (5), మీషో (6), స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (7), బోట్‌ (8), అర్బన్‌ కంపెనీ (9), అగ్నికుల్‌ కాస్మోస్‌ (10) తరవాత స్థానాల్లో నిలిచాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని