close

తాజా వార్తలు

ఐదేళ్లలో 1,000 మోసాలు..!

 పట్టణ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ నివేదిక

న్యూదిల్లీ: పట్టణ సహకార బ్యాంకుల్లో ఐదేళ్లలో 1,000కిపైగా మోసం కేసులు నమోదైనట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ మోసాల మొత్తం విలువ రూ.220 కోట్లుగా పేర్కొంది. ఆర్‌బీఐను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిల్లో 181 కేసుల్లోనే రూ.127.7కోట్లు విలువైన మోసాలు జరిగినట్లు వెల్లడించింది. బ్యాంకులు క్రిమినల్‌ ఫిర్యాదులు నమోదు చేసిన వాటినే ఆర్‌బీఐ పరిగణలోకి తీసుకొంది. ఈ మోసాలకు కారణమైన అంతర్గత కారణాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆర్‌బీఐ వద్ద నమోదైన మోసం కేసుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకొన్నారో అన్న సమాచారం మాత్రం అందుబాటులో లేదు. 

పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంకులో మోసాలు విషయం ఆర్‌బీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఆ బ్యాంక్‌ ఆర్‌బీఐ నిబంధనల కింద ఉంది. ఈ బ్యాంకు హెడీఎల్‌ సంస్థకు ఇచ్చిన రుణాలు, మొండి బకాయిల విషయం దాచిపెట్టడంతో సమస్యగా  మారింది. చివరికి బ్యాంకుకు ఉన్న రూ.8,880కోట్ల ఆస్తుల్లో రూ.6,500కోట్లు మొండిబకాయిలుగా మారిపోయాయి. ఈ క్రమంలో చాలా డమ్మీ ఖాతాలను కూడా ఆర్‌బీఐ కనుగొంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.