కొవిడ్ ప్ర‌భావంతో పెరుగుతున్న నిరుద్యోగిత‌ - Urban-unemployment-nears-12 percentage-as-covid-lockdowns-bite
close

Updated : 12/05/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ ప్ర‌భావంతో పెరుగుతున్న నిరుద్యోగిత‌

దేశ‌మంతా కోవిడ్ మ‌హ‌మ్మారితో లాక్‌డౌన్లు కొన‌సాగుతూ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన‌డంతో ప‌ట్ట‌ణ నిరుద్యోగం 12%కి ద‌గ్గ‌ర‌కి చేరింది. న‌గ‌రాల్లో నిరంత‌ర లాక్‌డౌన్లు ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను క‌ట్ట‌డి చేస్తున్నందున ఉద్యోగ మార్కెట్‌పై మ‌రింత ఒత్తిడి పెరిగింద‌ని ఆర్థిక‌వేత్త‌లు భావిస్తున్నారు. క‌రోనా వైర‌స్ యొక్క పున‌రుత్థానం, దానితో పాటుగా ఉన్న ఆంక్ష‌లు మిలియ‌న్ల ఉద్యోగాల‌ను తుడిచిపెట్టాయి. 

ప‌ట్ట‌ణ నిరుద్యోగం ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో 9.55% నుండి మే 9 వ‌ర‌కు వారంలో 11.72 శాతానికి చేరుకుంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) డేటా తెలిపింది. ఇది ఏప్రిల్ నెల‌వారీ సంఖ్య 9.78% కంటే దాదాపు రెండు శాతం ఎక్కువ‌.

అదేవిధంగా జాతీయ నిరుద్యోగిత రేటు మే 9తో ముగిసిన వారంలో 8.67 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగం కూడా 6.37% నుండి 7.29%కి పెరిగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జాతీయ, గ్రామీణ నిరుద్యోగిత రేట్లు కూడా ఏప్రిల్ నెల‌వారీ నిరుద్యోగిత రేటు కంటే ఎక్కువగానే ఉన్నాయి.

నిరుద్యోగం పెర‌గ‌డానికి లాక్‌డౌన్లే కార‌ణ‌మ‌ని మాత్ర‌మే కాకుండా మొత్తం ఆర్థిక కోణంతో పాటు చూడాల‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది లాక్‌డౌన్లు గ‌త సంవ‌త్స‌రం వ‌లె మెల్ల‌మెల్ల‌గా దేశ‌మంతా వ్యాపించాయి. కార్మిక‌, ఉపాధి మార్కెట్ మ‌న మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ  ప‌నిత‌నం తెల‌ప‌డానికి ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంది. అనేక బ్రోక‌రేజ్ మ‌రియు ఆర్థిక సంస్థ‌లు జీడీపీ అంచ‌నాను త‌గ్గించాయి. బ‌ల‌మైన ఆర్థిక పున‌ర్‌జ్జీవ‌నానికి భార‌త్ ఎంత త్వ‌ర‌గా ఈ వైర‌స్‌ను అరిక‌ట్ట‌గ‌ల‌దో అన్న‌దానిపై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లుగా క‌న‌ప‌డుతుంద‌ని ఇండియ‌న్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త సునీల్ కుమార్ సిన్హా అన్నారు.

రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ 2021-22 వృద్ఙి అంచ‌నాను ఇంత‌కుముందు అంచ‌నా వేసిన 13.7 శాతం నుండి 9.3 శాతానికి త‌గ్గించింది. జేపీ మోర్గాన్ 13% నుండి 11% వ‌ర‌కు, యూబీఎస్ 11.5% నుండి 10% వ‌ర‌కు త‌గ్గించాయి.

అయితే గ‌తేడాది ఇదే కాలంలో జాతీయ నిరుద్యోగిత రేటు 2020 మే 10తో ముగిసిన వారంలో దాదాపు 24% ఉంది. ప‌ట్ట‌ణ నిరుద్యోగం 27.83 శాతంగా `సీఎమ్ఐఈ` డేటా చూపిస్తుంది. ఉద్యోగాల మార్కెట్లో ఆర్థిక సెంటిమెంట్ పాత్ర ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాల చిన్న చిన్న‌ లాక్‌డౌన్లు పాక్షిక జాతీయ లాక్‌డౌన్‌కి స‌మానం. ప‌ట్ట‌ణ నిరుద్యోగిత‌తో పోలిస్తే గ్రామీణ నిరుద్యోగం మెరుగ్గా ఉంద‌ని కాదు. గ్రామీణ భార‌తంలో త‌క్కువ ఉత్పాద‌క‌త‌, త‌క్కువ ఆదాయాలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు న‌ష్టాలే క‌ల‌గిస్తున్నాయి. పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాలు సృష్టించ‌గ‌ల కొత్త పెట్టుబ‌డులు ఈ ఏడాది దేశంలో వ‌చ్చే అవ‌కాశం త‌క్కువేన‌ని `సీఎంఐఈ` ముఖ్య ప్ర‌తినిధి మ‌హేష్ వ్యాస్ అన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని