ఈ స‌మ‌యంలో ఆర్థిక ప్ర‌ణాళిక చాలా అవ‌స‌రం - Utilize-this-free-time-to-review-your-finances
close

Published : 08/05/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ స‌మ‌యంలో ఆర్థిక ప్ర‌ణాళిక చాలా అవ‌స‌రం

కొత్తగా మదుపు చేయదల్చుకున్న వారైనా, లేదా ఎప్పటినుంచో మదుపు చేస్తున్నా , ఒక పధ్ధతి ప్రకారం పెట్టుబడులుచేస్తూ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి . చాలామంది పెట్టుబడి చేయాలనుఉంటారు గానీ , ఎక్కడనుంచి మొదలు పెట్టాలో తెలియదు. పెట్టుబ‌డులు ప్రారంభించాల‌ని అనుకుంటాం. ఏదో కారణంతో ఆలస్యం చేస్తాం. కోవిడ్‌-19 వలన చాలా రాష్ర్టాలు లాక్‌డౌన్‌, క‌ర్ప్యూ వంటివి విధించ‌డంతో చాలామంది ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇంటి నుంచే ప‌నిచేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు. అందుకు ఇప్పుడు ఉన్న ఈ స‌మ‌యంలో మీ ఆర్థిక స్థితిపై స‌మీక్ష చేసుకోవ‌చ్చు.


1. పోర్ట్ ఫోలియో ను సమీక్షించండి . సరైన మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ ను ఎంచుకోవడం తో పోర్ట్ ఫోలియో ను తయారుచేసుకోవాలి . దీనికోసం ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాలి. దీనివలన ఏవి మంచి పనితీరు కలిగి ఉన్నాయో తెలుసుకోవచ్చు.
2. చాలామంది పెట్టుబడి చేయాలనుకుంటారు గానీ, ఎలా , ఎందులో చేయాలో తెలియదు. అందరికీ తెలిసిన విషయం మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ఒక‌టే. కానీ మ్యూచువల్ ఫండ్ల‌లో అనేక రకాలు ఉంటాయి . తమకున్న పెట్టుబడి, కాలపరిమితి, రిస్క్ సామర్ధ్యం, వంటి విషయాలను పరిగణించి , ఏ ఫండ్లు సరైనవో తెలుసుకోవాలి . నాణ్యమైన ఫండ్ల‌ వలన అధిక సంపద చేకూర్చుకోవచ్చు . ఒకవేళ పోర్ట్ ఫోలియో లో నాణ్యమైన ఫండ్లు లేకపోతే, వేరే వాటితో తగిన మార్పులు చేయాలి.
3. ఇల్లు కొనుగోలు కు అవసరమైన డౌన్ పేమెంట్ గానీ, పదవీవిరమణ నిధి గానీ, విహార యాత్రలు వంటి లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి చేయాలి. కేవ‌లం పన్ను ఆదా కోసం పెట్టుబడులు చేయకూడ‌దు. దీనికోసం నిపుణుల సలహాతో , ఒక పధ్ధతి ప్రకారం క్రమశిక్షణతో పెట్టుబడులు చేయాలి .  అప్పుడు అన్ని లక్ష్యాలను సునాయాసంగా
చేరుకోవచ్చు.
4. స్వల్పకాలంలో జరిగే హెచ్చుతగ్గులను పరిగణించకుండా, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఓర్పుతో, క్రమశిక్షణతో ,పట్టుదలతో మదుపు చేయడం వలన అన్ని లక్ష్యాలను చేరవచ్చు. అవసరాన్ని బట్టి పోర్ట్ ఫోలియో ను సమీక్షించుకుంటూ ఉండాలి .


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని