Mobile subscribers: వీఐకు తగ్గిన సబ్‌స్క్రైబర్లు.. జియో, ఎయిర్‌టెల్‌కు బూస్ట్‌! - VIL loses 42.8 lakh mobile users in June
close

Published : 23/08/2021 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mobile subscribers: వీఐకు తగ్గిన సబ్‌స్క్రైబర్లు.. జియో, ఎయిర్‌టెల్‌కు బూస్ట్‌!

దిల్లీ: భారత టెలికాం మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా మరోసారి చందాదారులను కోల్పోయింది. జూన్‌ నెలలో 42.8 లక్షల మంది యూజర్లు ఆ కంపెనీ నెట్‌వర్క్‌ను వీడినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) వెల్లడించింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌కు సబ్‌స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్‌ పేర్కొంది. జూన్‌ నెలకు గానూ జియోకు 54.6 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 38.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు పెరిగారని తెలిపింది.

జూన్‌ నెలలో వొడాఫోన్‌ ఐడియా సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో ఆ కంపెనీ వినియోగదారుల సంఖ్య 27.3 కోట్లకు చేరింది. అదే సమయంలో కొత్తగా చేరిన సబ్‌స్క్రైబర్లతో జియో చందాదారుల సంఖ్య 43.6 కోట్లకు చేరగా.. ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 35.2 కోట్లకు పెరిగింది. దేశంలో మొత్తంగా మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 120.2 కోట్లకు చేరినట్లు ట్రాయ్‌ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో టెలికాం యూజర్ల సంఖ్య పెరగ్గా.. గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిందని పేర్కొంది. బ్రాండ్‌బ్యాండ్‌ విషయానికొస్తే 43 కోట్ల మంది చందాదారులతో జియో అగ్రస్థానంలో నిలవగా.. భారతీ ఎయిర్‌టెల్‌ (19కోట్లు), వొడాఫోన్‌ ఐడియా (12కోట్లు), బీఎస్‌ఎన్‌ఎల్‌ (2 కోట్లు), యాక్ట్‌ (19 లక్షలు) మంది చందాదారులతో టాప్‌-5 స్థానాల్లో నిలిచినట్లు ట్రాయ్‌ వెల్లడించింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని