వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా టీకా సమాచారం: జియో - Vaccine info via WhatsApp Chatbot Jio
close

Published : 10/06/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా టీకా సమాచారం: జియో

దిల్లీ: వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా ఇతరత్రా సేవలతో పాటు కొవిడ్‌ టీకా లభ్యతపైనా వినియోగదారులకు సమాచారం ఇవ్వడాన్ని జియో ప్రారంభించింది. ప్రతిసారి వన్‌-టైం-పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే ఈ కొత్త సేవల ద్వారా వ్యాక్సిన్‌ లభ్యత సమాచారాన్ని తెలుసుకోవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 7000770007 నెంబరుకు ‘హాయ్‌’ అని టైప్‌ చేసి ఈ సదుపాయాన్ని పొందొచ్చని తెలిపాయి. ‘రీఛార్జ్‌, చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం, సందేహాల నివృత్తి లాంటి వాటి కోసం జియో వినియోగదార్లు వాట్సాప్‌ చాట్‌బోట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇకపై కొవిడ్‌-19 టీకా లభ్యతపై సమాచారాన్ని కూడా పొందవచ్చ’ని కంపెనీ వర్గాలు తెలిపాయి. టీకా సంబంధిత సమాచారం, జియో రీఛార్జ్‌ సేవల విషయంలో ఇతరత్రా మొబైల్‌ నెట్‌వర్క్‌లపైనా ఈ చాట్‌బోట్‌ పనిచేస్తుందని పేర్కొన్నాయి. నెంబర్‌ పోర్టబిలిటీ సేవలు, జియో సిమ్‌, జియో ఫైబర్‌, జియో మార్ట్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ లాంటి వాటికి కూడా చాట్‌బోట్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించాయి.
14 నెలల గరిష్ఠానికి ఈక్విటీ పెట్టుబడులు
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్నా, అంచనాలను మించి స్టాక్‌ మార్కెట్‌ రాణిస్తుండటంతో ఈక్విటీ ఫండ్లలోకి నికర పెట్టుడులు పెరిగాయి. గత 14 నెలల కాలంతో పోలిస్తే మేలో అత్యధిక మొత్తంలో నిధులు ఈ ఫండ్లలోకి వచ్చాయి. మేలో ఈక్విటీ ఆధారిత ఫండ్లలోకి నికరంగా రూ.10వేల కోట్లు వచ్చినట్లు భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) నివేదిక తెలిపింది. 2020 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈక్విటీ ఫండ్ల నుంచి డబ్బు వెనక్కి వెళ్లింది. మార్చి నుంచి నికర పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వరుసగా మూడో నెలలోనూ ఈక్విటీ ఫండ్లలో మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ ఎస్‌ వెంకటేశ్‌ వివరించారు. ఏప్రిల్‌లో 3,79,53,524 సిప్‌ ఖాతాలుంటే.. మేలో అవి 3,88,35,530కి చేరాయని తెలిపారు. ఈ సిప్‌ ఖాతాల నుంచి దాదాపు రూ.8,818.90 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌లో ఈ మొత్తం రూ.8,596.25 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.33.05 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన వెల్లడించారు. హైబ్రిడ్‌ ఫండ్లలోకి రూ.6,217 కోట్లు వచ్చాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మాత్రం నికర పెట్టుబడులు తగ్గాయి. మేలో ఈ ఫండ్లలోకి రూ.288 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌లో ఈ మొత్తం రూ.680 కోట్లు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని