close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేదాంతా డీలిస్టింగ్‌ ప్రక్రియ ప్రారంభం

జూన్‌ 24 వరకు ఇ-ఓటింగ్‌

దిల్లీ: అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా కంపెనీని స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ చేసేందుకు అవసరమైన ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. వాటాదార్ల అనుమతి కోసం ఇ-ఓటింగ్‌ మొదలైంది. జూన్‌ 24 వరకు వాటాదార్లు తమ అనుమతి తెలిపే అవకాశం ఉంది. అగర్వాల్‌కు చెందిన వేదాంతా రిసోర్సెస్‌, వేదాంతాలోని 49.9 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.87.50 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాటాదార్ల ఆమోదం కోరినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ ప్రతిపాదన 66.7 శాతం మైనార్టీ షేర్‌హోల్డర్ల ఆమోదం పొందాల్సి ఉంటుంది. వాటాదార్ల ఆమోదం పొందాక, కంపెనీ రివర్స్‌ బుక్‌-బిల్డింగ్‌ పద్ధతిలో షేర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో వాటాదార్లు తమ వద్ద ఉన్న షేర్లను ఏ ధరలో అమ్మాలనుకుంటున్నారో బిడ్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా బిడ్డింగ్‌ చేసిన ధరల ఆధారంగా అంతిమ ధరను (ఫైనల్‌ ప్రైస్‌/డిస్కవర్డ్‌ ప్రైస్‌) ప్రకటిస్తారు. కంపెనీ బోర్డు ఈ ధరకు షేర్ల కొనుగోలుకు 5 రోజుల్లో ముందుకు రావొచ్చు లేదంటే తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డిస్కవర్డ్‌ ప్రైస్‌ను అనుమతించకపోతే బోర్డు/కొనుగోలుదారు గతంలో ప్రకటించిన ఆఫర్‌ ధర (రూ.87.50) కంటే మెరుగైన ధర (కౌంటర్‌ ఆఫర్‌) ప్రకటించవచ్చు. కంపెనీలో ప్రమోటరు వాటా ఎప్పుడైతే 90 శాతానికి చేరుకుంటుందో అప్పుడే డీలిస్టింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు లెక్క. ఒకవేళ ప్రమోటరు ఈ మేరకు వాటాను పెంచుకోలేకపోతే స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీని డీలిస్ట్‌ చేయడం కుదరదు. ఇదిలా ఉంటే, వేదాంతా ప్రస్తుతం ఆఫర్‌ చేసిన డీలిస్టింగ్‌ ధర ఒక్కో షేరుకు రూ.87.50 కాగా, ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.180కి చాలా దూరంగా ఉంది. అలాగే 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.60 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మంగళవారం ఈ షేరు బీఎస్‌ఈలో రూ.88 వద్ద స్థిరపడింది. ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) ఈ డీలిస్టింగ్‌ ప్రక్రియను ‘అవకాశవాదం’గా అభివర్ణించింది. కాగా, మే 26 నుంచి జూన్‌ 24 మధ్య వాటాదార్లు తమ ఓటును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించినట్లు వేదాంతా కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.