వాహ‌న స్ర్కాపేజ్ పాల‌సీని  ప్ర‌క‌టించిన నిర్మ‌లా సీతారామ‌న్‌ - Vehicle-scrappage-policy-budget-2021
close

Updated : 01/02/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహ‌న స్ర్కాపేజ్ పాల‌సీని  ప్ర‌క‌టించిన నిర్మ‌లా సీతారామ‌న్‌

 

నేడు ప్ర‌వేశ‌పెట్టిన 2021-22 బ‌డ్జెట్‌లో  పాత వాహ‌నాల‌ను  తొల‌గించేందుకు గానూ స్వ‌చ్ఛంద వాహ‌న స్క్రాపింగ్ విధానాన్ని ప్ర‌క‌టించారు.  కాల‌ప‌రిమితి ముగిసిన వాహ‌నాలు ఫిటెనెస్ ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. 20 సంవ‌త్స‌రాల పాత‌ వ్య‌క్తిగ‌త వాహ‌నాలు, ఆటోమెబైల్స్, 15 సంవ‌త్స‌రాల పాత వాణిజ్య వాహ‌నాలకు ఫిటెనెస్ ప‌రీక్షలు చేయించాలి. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని తెలిపారు. 

ఈ నిర్ణ‌యంతో ఎమ్‌&ఎమ్‌, టాటామోటార్స్‌, మారుతీ వంటి ఆటో రంగం స్టాక్స్ 1 శాతం పెరిగాయి. వాహన స్క్రాపేజ్ విధానం దేశంలోని ఆటోమొబైల్ తయారీ పరిశ్రమకు పెద్ద ఎత్తున తోడ్పడుతుందని రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇందుకు ముందు చెప్పారు. 

ర‌హ‌దారుల‌కు సంబంధించి- రూ.5వేల కోట్లుతో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధి, 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం, రూ.25వేల కోట్లతో పశ్చిమ్‌ బెంగాల్‌లో రహదారుల నిర్మాణం, రూ.19వేల కోట్లుతో అస్సాంలో రహదారుల అభివృద్ధి, కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణల‌ను బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని