తుక్కు విధాన ప్రోత్సాహకాలు అనువుగా లేవు: జెఫ్రీస్‌ - Vehicle scrapping policy Insufficient incentive unlikely to trigger replacement says Jefferies
close

Updated : 23/03/2021 20:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుక్కు విధాన ప్రోత్సాహకాలు అనువుగా లేవు: జెఫ్రీస్‌

ముంబయి: ప్రజలు తమ పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఇచ్చి.. కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అనువుగా ‘వాహన తుక్కు విధానం’ లేదని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్‌ తన నివేదికలో పేర్కొంది. పాత వాహనాల మార్పిడికి ప్రకటించిన ప్రోత్సాహకాలు తగినంతగా లేవని విశ్లేషించింది. ప్రతిపాదిత విధానం ప్రకారం, తుక్కు వాహనానికి షోరూమ్‌ విలువలో 4-6 శాతానికి దగ్గరగా నగదు ప్రోత్సాహకం అందనుంది. తుక్కు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే, కొత్త వాహన కొనుగోలుపై 5 శాతం వరకు రాయితీ, రహదారి పన్నుపై 25 శాతం రాయితీ లభించనుంది. అయితే పాత వాహనాలకు ఇప్పుడైనా వాహన ధరలో 2-3 శాతం బహిరంగ విపణిలో లభిస్తోందని జెఫ్రీస్‌ గుర్తుచేసింది.
వాహనాలకు గిరాకీ మళ్లీ పుంజుకోవడం, కమొడిటీ ధరలు పెరిగి, మార్జిన్లపై ఒత్తిడి పడుతుండటంతో వాహన సంస్థలు (ఓఈఎమ్‌లు) కొత్త వాహనాలపై అదనపు రాయితీలు ఇచ్చేందుకు సుముఖత చూపకపోవచ్చని అభిప్రాయపడింది. 15 ఏళ్లు వినియోగించిన వాణిజ్య వాహనాలకు, 20 ఏళ్లు దాటిన ప్రైవేట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ రుసుముతో పాటు రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

* ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సుమారు 17 లక్షల మధ్య, భారీ వాణిజ్య వాహనాలు, 51 లక్షల తేలికపాటి వాహనాలు 15-20 ఏళ్లుగా సేవలందిస్తున్నవి ఉన్నాయి.
* 2021-22లో మధ్య, భారీ స్థాయి వాహన విభాగంలో 2,59,000 వాహనాలు, ప్రయాణికుల వాహన విభాగంలో 33 లక్షల వాహనాలు విక్రయమయ్యే అవకాశం ఉందని జెఫ్రీస్‌ అంచనా వేసింది.

ఇవీ చదవండి...

తయారీ రంగం కోలుకుంటోంది

ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని