వెంటిలేటర్ల తయారీ వేగవంతం! - Ventilator production has been ramped up
close

Published : 09/04/2021 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంటిలేటర్ల తయారీ వేగవంతం!

కరోనా రెండో వేవ్‌ నేపథ్యంలో భారీ డిమాండ్‌

అహ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతంగా‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడే కరోనా బాధితులకు ప్రాణ రక్షణగా ఉపయోగపడే వెంటిలేటర్ల డిమాండ్‌ సైతం పుంజుకుంది. దీంతో వీటి తయారీని పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జనవరి-ఫిబ్రవరిలో తగ్గిన డిమాండ్‌ తాజాగా మరోసారి ఊపందుకుందని పేర్కొన్నాయి.

తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. బాధితుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వడోదరా కేంద్రంగా పనిచేస్తున్న వెంటిలేటర్ల తయారీ కంపెనీ ‘మ్యాక్స్‌ వెంటిలేటర్‌‌’ సీఈఓ అశోక్ పటేల్‌ తెలిపారు. తాజాగా కరోనా బారిన పడుతున్న వారికి 5-6 రోజుల్లోనే వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించాల్సి వస్తోందని తెలిపారు. గతంలో ఈ వ్యవధి 10-15 రోజులుగా ఉండేదని వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 200 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరో 50 వెంటిలేటర్లు ఇన్‌స్టాల్‌ చేయనున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం తమ కంపెనీ నెలకు 400 యూనిట్లను తయారు చేస్తోందని అశోక్‌ తెలిపారు. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ కారణంగా డిమాండ్‌కు తగ్గట్లుగా వెంటిలేటర్లు అందించకలేకపోయామన్నారు. కానీ, ఈసారి ఆ సమస్య లేదని స్పస్టం చేశారు. ఇక క్రితం ఏడాది నెలకు 20 యూనిట్లుగా ఉన్న తమ తయారీ సామర్థ్యాన్ని 1000కి పెంచినట్లు తెలిపారు. సాధారణంగా వెంటిలేటర్లను అన్ని రకాల వ్యాధులు సోకిన రోగులకు వాడుతుంటారని.. కానీ, కరోనా నేపథ్యంలో వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది తయారు చేస్తున్నామని వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని