paytm: ఐపీవోకు వాటాదార్ల ఆమోదముద్ర - Vijay Shekhar Sharma led Paytm receives shareholders nod to raise Rs 12000 crore
close

Published : 12/07/2021 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

paytm: ఐపీవోకు వాటాదార్ల ఆమోదముద్ర

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నగదు చెల్లింపు సేవల సంస్థ పేటీఎం ఐపీవోకు వచ్చే దిశగా మరో అడుగు పడింది. దాని మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ వాటాలు జారీ చేసి రూ.12వేల కోట్లు సేకరించేందుకు వాటాదారులు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై నిర్వహించిన వాటాదారుల ఆన్‌లైన్‌ ఓటింగ్‌ జులై 9వ తేదీన మొదలై 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో కంపెనీ ఐపీవోకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దీంతోపాటు కంపెనీలోని ఇప్పటికే వాటాదార్ల వద్ద ఉన్న కొన్ని షేర్లను కూడా విక్రయించి నిధులు సమీకరించనుంది. మొత్తం కలుపుకొంటే రూ.16,600 కోట్ల నిధులను సేకరించే అవకాశం ఉంది.

ఈజీఎంలో విజయ శేఖర శర్మను కంపెనీ ప్రమోటర్‌గా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఒక ప్రమోటర్‌గా సెబీ నిబంధనలు ప్రకారం  నడుచుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఆయన్నే కంపెనీ ఛైర్మన్‌, సీఈవో, ఎండీ బాధ్యతలను కొనసాగించనున్నారు. నిబంధనల ప్రకారం ప్రమోటర్‌కు కంపెనీలో కనీసం 20శాతం వాటాలు ఉండాలి. కానీ, శర్మ వద్ద ప్రస్తుతం 14.61శాతం వాటాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా పేటీఎం బోర్డులో కూడా మార్పులు చేసింది. పేటీఎంలో యాంట్‌ గ్రూప్‌కు 29.71శాతం, సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌కు 19.63శాతం, సిఫీ పార్టనర్స్‌కు 18.56 శాతం వాటాలు ఉన్నాయి. ఏజీహెచ్‌ హోల్డింగ్స్‌, టి రా ప్రైస్‌, డిస్కరీ క్యాపిటల్‌ బెర్క్‌షైర్‌హత్‌వేకు కూడా దీనిలో వాటాలు ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని