Vijaya Diagnostic IPO: విజయ డయాగ్నొస్టిక్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ఎప్పుడంటే.. - Vijaya Diagnostic Centre IPO opens September 1
close

Published : 25/08/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijaya Diagnostic IPO: విజయ డయాగ్నొస్టిక్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ఎప్పుడంటే..

ముంబయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ సహా 13 ప్రాంతాల్లో 80 కేంద్రాల ద్వారా రోగ నిర్థారణ సేవలు అందించే విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) సబ్‌స్క్రిప్షన్‌ సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఈ ఆఫర్‌ ద్వారా ప్రమోటర్‌ డాక్టర్‌ ఎస్‌.సురేంద్రనాథ్‌ రెడ్డి, ఇన్వెస్టర్లు కారాకోరమ్‌ లిమిటెడ్‌, కేదారా క్యాపిటల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 3.56 కోట్ల షేర్లను విక్రయించాలన్నది ప్రతిపాదన. ప్రమోటరు, ఇన్వెస్టర్లు ఈ ఇష్యూ ద్వారా తమ వాటాను 35 శాతం తగ్గించుకోనున్నారు. పాథాలజీ, రేడియాలజీ, రోగ నిర్థారణ సేవలను అందించే విజయ డయాగ్నొస్టిక్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.84.91 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.62.5 కోట్లే. ఇదే సమయంలో ఆదాయం రూ.354.18 కోట్ల నుంచి రూ.388.59 కోట్లకు పెరిగింది. ఐపీఓ షేరు ధర, కనీస-గరిష్ఠ షేర్ల కొనుగోలు పరిమితి వంటి ప్రాథమిక వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మొత్తం ఆరోగ్య సంరక్షణా సేవల్లో రోగనిర్ధారణ సేవల వాటా 8-14 శాతం ఉంటుంది. జీవనశైలి ఆరోగ్య సమస్యలు సహా కొత్త వ్యాధులు ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో సరైన చికిత్స కోసం రోగనిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి.  అలాగే చికిత్స అనంతరం కూడా ఔషధాల ప్రభావం కోసం తిరిగి పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల్లో ఈ రంగం భారీగా వృద్ధి చెందింది. 2020-23 మధ్య ఈ మార్కెట్‌ సైజు రూ.92,000 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని