close
Array ( ) 1

తాజా వార్తలు

విదేశాల్లో వివాదాలకూ‘వివాద్‌సే విశ్వాస్‌’

దిల్లీ: పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాల పరిష్కారానికి ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం పరిధిలోకి విదేశాల్లో వివాదం కేసులు కూడా వస్తాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి ఈ పథకం సువర్ణావకాశం వంటిదని వెల్లడించింది. జనవరి 31 లేదా అంతకన్నా ముందు దాఖలైన పిటిషన్లు, రిట్‌లు ఈ పథకానికి అర్హమైనవని ఐటీ శాఖ తెలిపింది. ఇప్పటికే చెల్లించిన పన్నులకు సంబంధించిన వివాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేసింది. పన్నులు, పెనాల్టీలు, వడ్డీ ఫీజులు, టీడీఎస్‌, టీసీఎస్‌ వివాదాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.