close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/04/2020 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

విపణిలోకి వీవో s6 5జీ స్మార్ట్‌ఫోన్‌

బీజింగ్‌:  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయరీ సంస్థ  వీవో ఎస్‌6  5జీ  ఫోన్‌ను విడుదల చేసింది. అమోలెడ్‌ స్క్రీన్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, వెనుక భాగంలో నాలుగు కెమెరాలతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది. 
వీవో ఎస్‌6 ప్రత్యేకతలు : 
* 6.44 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే 
* 20:9 రిజల్యూషన్‌ నిష్పత్తితో ఎఫ్‌హెచ్‌డీ
* 48 మెగా పిక్సల్‌ కెమెరా
* 32 మెగా పిక్సల్‌  సెల్ఫీ కెమెరా
* 8 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ షూటర్‌ 
* 2 మెగా పిక్సల్‌ మ్యాక్రో స్నాపర్‌
* 8 జీబీర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 
ముందు భాగంలో వాటర్‌ డ్రాప్‌ నాచ్‌, ఫింగర్‌ ప్రింట్ రీడర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.  4500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 18w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. పొట్రైట్‌ షాట్స్‌ కోసం 2 ఎంపీ డెప్తి సెన్సార్‌ను వినియోగించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఉన్న మొబైల్‌ ధర రూ.28,678 కాగా.. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఉన్న మొబైల్‌ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, తెలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.