Vodafone Idea: వొడాఫోన్‌-ఐడియా స్పెక్ట్రం చెల్లింపులు వాయిదా.. - Vodafone Idea accepts four year payment moratorium on AGR dues
close

Published : 20/10/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vodafone Idea: వొడాఫోన్‌-ఐడియా స్పెక్ట్రం చెల్లింపులు వాయిదా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టెలికం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా బోర్డు  స్పెక్ట్రం వేలం చెల్లింపులను(ఏజీఆర్‌ బకాయిలు) నాలుగేళ్లు వాయిదా వేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ‘‘కంపెనీ స్పెక్ట్రం వేలం బకాయిలను నాలుగేళ్ల కాలానికి(అక్టోబర్‌ 2021 నుంచి సెప్టెంబర్‌ 2025) వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది’’ అని స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతోపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం ఇచ్చిన ఇతర ఆప్షన్లను కూడా కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పరిశీలించనున్నారని తెలిపింది. 

వొడాఫోన్‌ ఐడియా ప్రకటన తర్వాత మార్కెట్లో కంపెనీ షేర్లు 5.6శాతం పెరిగి ఒక దశలో రూ.10.56కు చేరాయి. ఇటీవల ప్రభుత్వం టెలికం రంగంలో కీలక సంస్కరణలు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు ఈమేరకు ఓ లేఖ రాసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారిటోరియం విధించడంపై అక్టోబర్‌ 29లోపు అభిప్రాయం వెల్లడించాలని కోరింది. ఇక మారిటోరియం కాలానికి సంబంధించిన వడ్డీని ఈక్విటీగా మార్చడంపై కూడా 90 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని పేర్కొంది. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని