వోల్వో కారు ధరలు రూ.2 లక్షల వరకు ప్రియం - Volvo Car India announces price hike for select models
close

Updated : 04/05/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వోల్వో కారు ధరలు రూ.2 లక్షల వరకు ప్రియం

దిల్లీ: పలు మోడళ్ల ధరలను రూ.2 లక్షల వరకు పెంచుతున్నట్లు వోల్వో కార్‌ ఇండియా ప్రకటించింది. పెరిగిన ముడి వస్తువుల వ్యయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, తక్షణమే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కంపెనీ లగ్జరీ సెడాన్‌ ఎస్‌90, ప్రీమియం ఎస్‌యూవీలు ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ90 ఎక్స్‌-షోరూమ్‌ ధరలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెంచింది. కొత్త ధరల ప్రకారం.. ఎస్‌90 డీ4 ఇన్‌స్క్రిప్షన్‌ ధర రూ.60.9 లక్షలుగా, ఎక్స్‌సీ40 టీ4 ఆర్‌ డిజైన్‌ రూ.41.25 లక్షలు, ఎక్స్‌సీ60 డీ5 ఇన్‌స్క్రిప్షన్‌ రూ.60.9 లక్షలు, ఎక్స్‌సీ90 డీ5 ఇన్‌స్క్రిప్షన్‌ ధర రూ.88.9 లక్షలుగా ఉన్నాయి. కొత్తగా విడుదల చేసిన కాంపాక్ట్‌ లగ్జరీ సెడాన్‌ ఎస్‌60 ధరలో మార్పు చేయలేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని