close

Published : 15/04/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

8 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

దిల్లీ: ముడిచమురు, లోహాల ధరలు అమాంతం పెరగడంతో వరుసగా మూడో నెల డబ్ల్యూపీఐ ఆధారిత టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. ఫిబ్రవరిలో 4.17శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం.. మార్చిలో 7.39శాతంగా నమోదైంది. గతేడాది మార్చిలో ఇది 0.42శాతంగా ఉండటం గమనార్హం. కాగా.. టోకు ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండటం గత 8ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం 2012 అక్టోబరులో 7.4శాతంగా నమోదైంది. 

మార్చి నెలలో పప్పులు, పండ్ల ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 3.24శాతంగా ఉంది. ఇక కూరగాయల ధరలు మాత్రం పడిపోయాయి. గత నెలలో వీటి ధరలు 5.19శాతం మేర తగ్గాయి. ఇదిలా ఉండగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో మార్చిలో ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 10.25శాతంగా నమోదైంది. ఇక వినియోగదారుల ధరల సూచీల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా మార్చి నెలలో గరిష్ఠంగా 5.52 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని