వ్య‌క్తిగ‌త రుణం పొంద‌డం ఇపుడు చాలా సుల‌భం - What-a-personal-loan-costs-you
close

Updated : 18/01/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్య‌క్తిగ‌త రుణం పొంద‌డం ఇపుడు చాలా సుల‌భం

మీకు ఇప్ప‌టికే బ్యాంకులో ఖాతా ఉంటే మీ వ్య‌క్తిగ‌త రుణం కోసం బ్యాంకులు  అనేక ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నాయి. ఇవి పొంద‌డం చాలా సుల‌భం, అయితే వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌నే చెప్పాలి. రుణం పొంద‌డానికి మీరు ఆస్తి, బంగారం ఉంచాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి గ్యారంటీ అక్క‌ర‌లేదు. అయితే ఆఫ‌ర్‌పై ఉన్న రుణ మొత్తం, దాని వ‌డ్డీ రేటు, మీ ఆదాయం, క్రెడిట్‌, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం వంటి ప‌రిమితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

వ్య‌క్తిగ‌త రుణాల యొక్క వివిధ వెర్ష‌న్లు ఇపుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని త‌క్ష‌ణ రుణాలంటారు. ఇవి ముందుస్తుగా ఆమోదించ‌బ‌డిన రుణాలు. బ్యాంకులు మీ స‌మాచారాన్ని (క్రెడిట్ రిపోర్ట్స్‌)ను ముందుగానే చూస్తారు. దాని ఆధారంగా మీకు ఫోన్‌లో గాని, మెయిల్‌లోగాని తెలిపి, మీ ఆమోదం పొంది ఈ రుణాన్ని అందిస్తారు.

వ్య‌క్తిగ‌త రుణాలు పొంద‌డం సుల‌భ‌మే, కానీ రుణాల‌కు అధిక వడ్డీ రేట్లు ఉంటాయ‌ని గుర్తించుకోవాలి. వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకునేవారు డిఫాల్ట్ అయ్యేవారు కూడా ఎక్కువే. కారుకి తీసుకునే రుణ వ‌డ్డీ క‌న్నా ఎక్కువ వ‌డ్డీ వ్య‌క్తిగ‌త రుణాల‌కుంటుంది.

వివిధ బ్యాంకులు అందించే వ్య‌క్తిగ‌త రుణ వ‌డ్డీ రేట్లు, ఇత‌ర వివ‌రాలు ఈ ప‌ట్టిక‌లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని