ఆగ‌స్టు 4న ఐపీఓకు రానున్న `విండ్‌లాస్ బ‌యోటెక్‌` - Windlas-Biotech-IPO-opens-August-4
close

Published : 29/07/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగ‌స్టు 4న ఐపీఓకు రానున్న `విండ్‌లాస్ బ‌యోటెక్‌`

విండ్‌లాస్ బ‌యోటెక్ ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) ఆగ‌స్టు 4న ప్రాధ‌మిక మార్కెట్‌లోకి రానుంది.  దీని ధ‌ర ఒక్కో షేరుకు రూ. 448-460గా నిర్ణ‌యించ‌బ‌డింది. డెహ్రాడూన్‌కు చెందిన విండ్‌లాస్ బ‌యోటెక్ భార‌త‌దేశంలోని దేశీయ ఔష‌ధ త‌యారీలో కాంట్రాక్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎంఓ)లో 5 అగ్ర‌శ్రేణి సంస్థ‌ల‌లో ఒక‌టి. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా విండ్‌లాస్ బ‌యోటెక్ రూ. 165 కోట్లు స‌మీక‌రించ‌నుండ‌గా, ప్ర‌మోట‌ర్లు, ఇప్ప‌టికే ఉన్న వాటాదార్లు 51,42,067 ఈక్విటీ షేర్ల‌ను ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ క‌లిగి ఉంది.

ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌లో పాల్గొనే పెట్టుబ‌డిదారుల‌లో ప్ర‌మోట‌ర్ విమ్లా విండ్‌లాస్ 11,36,000 ఈక్విటీ షేర్లు, తానో ఇండియా ప్ర‌వేట్ ఈక్విటీ ఫండ్ 2కు 40,06,067 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. తానో ఇండియా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ త‌న మొత్తం 22% వాటాను విక్ర‌యించ‌డం ద్వారా సంస్థ నుండి నిష్క్ర‌మించ‌నుంది. మ‌దుపుదారులు క‌నీసం 30 ఈక్విటీ షేర్ల‌కు, త‌ర్వాత 30 షేర్ల గుణిజాల‌లో బిడ్‌లో పాల్గొన‌వ‌చ్చు. ఆగ‌స్టు 6న ఈ ఇష్యూ ముగుస్తుంది. ఇది 2021 క్యాలెండ‌ర్లో ఇప్ప‌టివ‌ర‌కు 31వ ఐపీఓ అవుతుంది.

అశోక్ కుమార్ విండ్‌లాస్‌, హితేష్ విండ్‌లాస్‌, మ‌నోజ్ కుమార్ విండ్‌లాస్, ఏకేడ‌బ్ల్యుడ‌బ్ల్యుబీఎల్ ఫ్యామిలీ ప్రైవేట్ ట్ర‌స్ట్ ఈ సంస్థ ప్ర‌మోట‌ర్లు. విండ్‌లాస్ బ‌యోటెక్‌లో ప్ర‌మోట‌ర్లు, ప్ర‌మోట‌ర్ గ్రూప్ 78% వాటాను క‌లిగి ఉన్నాయి.

ఈ ఐపీఓలో 50% అర్హ‌త క‌లిగిన సంస్థాగ‌త కొనుగోలుదారుల‌కు కేటాయించ‌గా, 15% వాటాను సంస్థేత‌ర పెట్టుబ‌డిదారుల‌కు కేటాయించారు. రిటైల్ పెట్టుబ‌డిదారుల‌కు ఇష్యూ ప‌రిమాణంలో 35% వాటా ఉంటుంది. తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా వ‌చ్చే నిక‌ర ఆదాయాన్ని డెహ్రాడూన్ కంపెనీలో ఉన్న స‌దుపాయాల సామ‌ర్ధ్యం విస్త‌ర‌ణ‌కు ఉప‌యోగించుకోవాల‌ని కంపెనీ ప్ర‌ణాళిక‌లు వేసింది. అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల కొనుగోలుకు, కొన్ని పాత రుణాలు తిరిగి చెల్లించ‌డానికి, మ‌రికొంత మూల‌ధ‌న అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తారు.

ఎస్‌బీఐ క్యాపిట‌ల్ మార్కెట్స్‌, డీఏఎమ్ క్యాపిట‌ల్ అడ్వైజ‌ర్స్‌, ఐఐఎఫ్ఎల్‌ సెక్యూరిటీస్ ఇష్యూ బుక్ ర‌న్నింగ్ లీడ్ మేనేజ‌ర్స్‌గా నియ‌మించ‌బ‌డ్డాయి. ఈ ఇష్యూ రిజిస్ట్రార్‌గా లింక్ ఇన్‌టైమ్ ఇండియా వ్య‌వ‌హ‌రించ‌నుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని