IT: విప్రో సీఈఓకే అధిక వేతనం.. ఎంతంటే? - Wipro CEO Delaporte gets gets highest salary last fiscal in IT Industry
close

Published : 11/06/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IT: విప్రో సీఈఓకే అధిక వేతనం.. ఎంతంటే?

థియర్రీ డెలాపోర్ట్‌కు రూ.64 కోట్లు

దిల్లీ: విప్రో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) థియర్రీ డెలాపోర్ట్‌ గత ఆర్థిక సంవత్సరంలో 8.7 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64.3 కోట్లు) వార్షిక వేతనం అందుకున్నట్లు నియంత్రణ సంస్థలకు సంస్థ సమాచారం అందించింది. ఏకకాల నగదు పురస్కారం, వార్షిక స్టాక్‌ గ్రాంట్‌, ఏకకాల ఆర్‌ఎస్‌యూ (రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు) గ్రాంట్‌ వంటివన్నీ కలిపి 2020 జులై 6 నుంచి 2021 మార్చి 31 వరకు ఆయన ఈ మొత్తం అందుకున్నట్లు విప్రో తెలిపింది. గతంలో క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన థియర్రీ విప్రో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అబిదాలీ నీముచ్‌వాలా నుంచి 2020 జులై 6న బాధ్యతలు స్వీకరించారు. విప్రో 20-ఎఫ్‌ ఫైలింగ్‌ ప్రకారం, డెలాపోర్ట్‌ 1.31 మిలియన్‌ (సుమారు రూ.9.6 కోట్లు) వేతనం, అలవెన్సుల రూపంలో, 1.54 మిలియన్‌ డాలర్ల కమీషన్‌ - వేరియబుల్‌ పే రూపంలో,  5.18 మిలియన్‌ డాలర్లు ఇతర రూపంలో అందుకున్నట్లు విప్రో వివరించింది. దేశీయంగా ఐటీ సేవల రంగం నుంచి అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్‌గా డెలాపోర్ట్‌ నిలిచారు. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రూ.49.68 కోట్లు, టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ రూ.20.36 కోట్లు వార్షిక వేతనంగా అందుకున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని