ఈక్విటీ ఫండ్‌ల నుంచి రూ.4534 కోట్ల ఉపసంహరణ - Withdrawal of Rs 4534 crore from equity funds
close

Updated : 10/03/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈక్విటీ ఫండ్‌ల నుంచి రూ.4534 కోట్ల ఉపసంహరణ

డెట్‌ ఫండ్లలోకి  రూ.1,735 కోట్లు

దిల్లీ: ఈక్విటీ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ పథకాల నుంచి వరుసగా ఎనిమిదో నెలా మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఫండ్‌ పథకాల నుంచి రూ.4534 కోట్లు ఉపసంహరించుకున్నారని  అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌ బాగా పెరగడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఇందుకు కారణం. మరోవైపు డెట్‌ ఫండ్‌ పథకాల్లోకి రూ.1735 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* ఫిబ్రవరిలో అన్ని రకాల ఫండ్‌ పథకాల నుంచి నికరంగా రూ.1,843 కోట్ల పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. జనవరిలో మదుపర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ రూ.35,568 కోట్లు కావడం గమనార్హం.
* ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఫండ్‌ పథకాల నుంచి 2021 ఫిబ్రవరిలో రూ.4534 కోట్లు, జనవరిలో రూ.9,253 కోట్లు, 2020 డిసెంబరులో రూ.10,147 కోట్లు, నవంబరులో రూ.12,917 కోట్లు, అక్టోబరులో రూ.2,725 కోట్లు, సెప్టెంబరులో రూ.734 కోట్లు, ఆగస్టులో రూ.4,000 కోట్లు, జులైలో రూ.2,480 కోట్లు మేర పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. 2020 జూన్‌లో ఈక్విటీ ఫండ్‌ పథకాల్లోకి రూ.240.55 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* డెట్‌ ఫండ్‌ల విషయానికొస్తే గత నెలలో లిక్విడ్‌ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.17,360 కోట్లు వచ్చాయి. లో మనీ మార్కెట్‌ ఫండ్స్‌లోకి రూ.9,580 కోట్ల పెట్టుబడులు రాగా.. స్వల్ప కాలిక ఫండ్స్‌ నుంచి రూ.10,286 కోట్లు, కార్పొరేట్‌ బాండ్ల నుంచి రూ.6,752 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
* పసిడి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి కిందటి నెలలో రూ.491 కోట్లు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.625 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే తగ్గాయి.
* అయితే మ్యూచ్‌వల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఫిబ్రవరిలో పెరిగి రూ.31.64 లక్షల కోట్లకు చేరింది. జనవరిలో ఇది రూ.30.5 లక్షల కోట్లుగా నమోదైంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని