close
Array ( ) 1

తాజా వార్తలు

పన్ను వసూళ్లకు ఇంటి నుంచే పనిచేయండి

అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశం

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) లాక్‌డౌన్‌ ఫలితంగా పన్ను విభాగం అధికారులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదార్ల నుంచి వాటిని రాబట్టేందుకు ఫోన్‌, ఇ-మెయిల్‌ వంటి మాధ్యమాలు వినియోగించుకోవాలని పన్ను శాఖ ఆదేశించింది.  
మారుతీ సుజుకీ: మార్చి 15 -ఏప్రిల్‌ 30 వరకు ఉచిత సర్వీసు, వారెంటీ ప్రయోజనాలు కలిగిన తమ ఖాతాదార్లు వాటిని వినియోగించుకునే గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.
బీఎస్‌-6 వాహనాలు ఆలస్యం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బీఎస్‌-6 వాహనాలను భారత విపణిలో విడుదల చేస్తామని జపాన్‌కు చెందిన వినియోగ వాహన తయారీదారు ఇసుజు వెల్లడించింది. మార్చి15-ఏప్రిల్‌ 15 మధ్య ముగిసే సర్వీస్‌ వారెంటీని మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇసుజు మోటార్స్‌ ఇండియా ప్రకటించింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రెపో ఆధారిత రుణ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ నెల 28 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. వ్యక్తిగత, రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాలు ప్రస్తుతం 7.25 శాతానికే లభ్యమవుతున్నట్లు బ్యాంకు తెలిపింది.
యూనియన్‌ బ్యాంక్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) కూడా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రుణ రేట్లను 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో కొత్త రుణ రేటు 7.2 శాతానికి దిగి వచ్చింది.
14 వరకు శాట్‌ పనిచేయదు
* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు మూసివేతను కొనసాగిస్తున్నట్లు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రైబ్యూనల్‌ (శాట్‌) ప్రకటించింది. ఇంతకుముందు ట్రైబ్యూనల్‌కు మార్చి 31 వరకు సెలవు ప్రకటించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.