ప్రమాద బీమా గురించి ఆసక్తికర విషయాలు - You-should-know-these-things-about-Travel-Insurance
close

Published : 02/02/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రమాద బీమా గురించి ఆసక్తికర విషయాలు

1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాద‌ బీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ ప‌థ‌కాలు ఏవీ వర్తించవు.  ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం రాదు.

2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

3. హెల్మెంట్ లేకుండా ఉన్న‌ సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా వర్తించదు.

4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన బీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.

5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన బీమా వర్తించదు.

6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో రూ.20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.

7. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన‌ప్పుడు ప్రమాదం జ‌రిగితే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.

8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేస్తే, వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.

9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారులను విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.

10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.

11. కారు ప్రయాణంలో సీట్ బెల్ట్‌ పెట్టుకోని వారికి ప్రమాదం జరిగితే కూడా ఏ విధమైన బీమా వర్తించదు.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని