షేర్లు కొందాం.. అధికంగా ఆర్జిద్దాం - Young lady investors are More interested in high risk high return asset class says a Survey
close

Published : 08/03/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షేర్లు కొందాం.. అధికంగా ఆర్జిద్దాం

నష్టభయాన్ని లెక్కచేయని యువతులు: గ్రో సర్వే 

దిల్లీ: దేశంలో 18-25 ఏళ్ల వయసున్న యువ మహిళా మదుపర్లు నష్టభయం ఉన్నా, అధిక ఆర్జనకు వీలున్న ఆర్థిక సాధానాల్లోనే పెట్టుబడులకు ఉత్సుకత చూపుతున్నారని గ్రో సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి పథకాల కంటే అధిక రాబడినిచ్చే స్టాక్‌ల వైపు మొగ్గు చూపుతున్న యువత మూడు రెట్లు ఉన్నారని పేర్కొంది. 28,000 మంది మహిళలను సర్వే చేసి, వారి పెట్టుబడి లక్ష్యాలను తెలుసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

57 శాతం మంది యువతులు తమ వ్యక్తిగత లక్ష్యాల కోసం మదుపు చేస్తున్నారు. 28 శాతం మంది ఆశించిన పర్యటనల కోసం, 28 శాతం మంది ఉన్నత విద్యాభ్యాసం కోసం మదుపు చేస్తున్నారు.

రూ.30 లక్షలు, అంత కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న 70 శాతం మంది మహిళలు ముందస్తు పదవీ విరమణ పొందేందుకు మదుపు చేస్తున్నారు. ఇదే లక్ష్యంతో రూ.10-30 లక్షల  వార్షిక వేతనం తీసుకుంటున్న వారిలో 36 శాతం మంది, రూ.5-10 లక్షల వార్షిక వేతనం తీసుకుంటున్న వారిలో 26 శాతం మంది ఉన్నారు. 

35 ఏళ్లు పైబడిన వారిలో 64 శాతం మంది పెళ్లి, పిల్లల విద్య కోసం మదుపు చేస్తున్నారు.

ఆదాయం, వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్లలో, 25 శాతం మంది బంగారంపై పెట్టుబడులు మదుపు చేస్తున్నారు.

రూ.10 లక్షలకు పైగా వార్షిక వేతనం అందుకుంటున్న వారిలో 40 శాతం మంది పసిడి పథకాల్లో మదుపు చేస్తున్నారు.

రూ.30 లక్షలకు పైగా వేతనం పొందుతున్న మహిళల్లో ఎక్కువ మంది స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

2,000 మంది అసలు పెట్టుబడులు పెట్టడం లేదని తెలిపారు. ఇందులో 49 శాతం మంది తమకు సరైన అవగాహన లేకపోవడం వల్ల, 32 శాతం మంది తమ వద్ద మిగులు ధనం లేక, 13 శాతం మంది మార్కెట్‌లో డబ్బు కోల్పోతామని భయంతో పెట్టుబడులు పెట్టడం లేదని వివరించారు.

ఇవీ చదవండి...

మహిళల ఆర్థిక భరోసాకు అడుగులివే...

గృహ రుణ రేట్లు అందుకు తగ్గాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని