19 నుంచి జొమాటో ఐపీఓ! - Zomato IPO from 19
close

Updated : 08/07/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

19 నుంచి జొమాటో ఐపీఓ!

ధరల శ్రేణి రూ.70- 72

దిల్లీ: జొమాటో లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.70-72గా ఉండొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. జులై 21న బక్రీద్‌ సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఉండటంతో జొమాటో పబ్లిక్‌ ఇష్యూ 22న ముగుస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూలో భాగంగా రూ.7,500 కోట్లు విలువ చేసే కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) ఇన్ఫోఎడ్జ్‌ రూ.375 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది.


హైదరాబాద్‌లో తగ్గిన గిడ్డంగుల అద్దె లావాదేవీలు: నైట్‌ ఫ్రాంక్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహమ్మారి నేపథ్యంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గిడ్డంగుల వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో 23 శాతం మేరకు క్షీణించింది. ఈ నగరాల్లో మొత్తం 3.17 కోట్ల చదరపు అడుగుల గిడ్డంగుల స్థలం 2020-21లో అద్దెకు వెళ్లినట్లు అంతర్జాతీయ స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ‘ఇండియా వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ రిపోర్ట్‌ 2021’ నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో గిడ్డంగుల వాడకం దాదాపు 30శాతానికి పైగా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ మొత్తం 24 లక్షల చదరపు అడుగుల లావాదేవీ నమోదైంది. 2019-20లో ఇది 34లక్షల చ.అ. మేరకు ఉంది. హైదరాబాద్‌ మొత్తం గిడ్డంగుల లావాదేవీల్లో 54 శాతాన్ని ఇ-కామర్స్‌ రంగం, 20శాతం వరకు ఎఫ్‌ఎంసీజీ రంగం వినియోగించుకుంటున్నట్లు తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో 20 శాతం, ముంబయిలో 23 శాతం, పుణెలో 42 శాతం, అహ్మదాబాద్‌లో 42 శాతం, కోల్‌కతాలో 22శాతం క్షీణత నమోదయ్యింది. బెంగళూరులో గతంతో పోలిస్తే ఏమాత్రం వ్యత్యాసం లేదు. చెన్నైలో మాత్రం 2019-20తో పోలిస్తే.. 2020-21లో 4 శాతం వృద్ధి నమోదయ్యింది.Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని