జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు? - Zomato planning to file IPO next month
close

Published : 20/03/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు?

దిల్లీ: ఆన్‌లైన్‌ అహార సేవల సంస్థ జొమాటో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సెబీకి పంపాల్సిన ప్రతిపాదనల ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబరు ఆఖరు కల్లా ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని.. ఇష్యూ సైజు, తేదీ, ధరల శ్రేణి వంటి విషయాలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 650 మిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి జొమాటో నిరాకరించింది.

2021 ప్రథమార్థంలో తొలి ఐపీఓకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ 2020 సెప్టెంబరులోనే వెల్లడించారు. ఈ మేరకు తమ ఫైనాన్స్‌, లీగల్‌ బృందాలు కసరత్తు చేస్తున్నాయని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపారు.

ఇవీ చదవండి...

టీసీఎస్‌ ఉద్యోగులకు వేతనపెంపు

మీ క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్ల విలువ తెలుసా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని