డేటా లీక్‌పై మొబిక్విక్‌ ఏమందంటే..? - above 3million MobiKwik users data up for sale
close

Updated : 30/03/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డేటా లీక్‌పై మొబిక్విక్‌ ఏమందంటే..?

 ఖండించిన కంపెనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: చెల్లింపుల యాప్‌ మొబీక్విక్‌ కీలక డేటా బయటకు పొక్కినట్లు సమాచారం.  దాదాపు 8.2 టెరాబైట్ల డేటా ఆన్‌లైన్‌లో విక్రయానికి వచ్చినట్ల వార్తలొస్తున్నాయి. వీటిల్లో కేవైసీ సమాచారం, ఫోన్‌నెంబర్లు, ఆధార్‌ నెంబర్లు వంటి వాటిని డార్క్‌వెబ్‌లో ఉంచారు. మొత్తం 3.5 మిలియన్ల డేటా ఉందని సెక్యూరిటీ రీసెర్చర్‌ రాజశేఖర్‌ రజారియా ఫిబ్రవరిలో పేర్కొన్నారు. సోమవారం ఒక లింక్‌ డార్క్‌వెబ్‌లో వైరల్‌గా మారింది. దీనిని పరిశీలించిన చాలా మంది వినియోగదారులు తమ వివరాలను దానిలో గుర్తించారు. చాలా మంది స్క్రీన్‌ షాట్లను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఈ డేటాలో పాస్‌వర్డ్‌లు మాత్రమే ఎన్‌క్రిప్టెడ్‌  రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం డేటాను 1.5 బిట్‌కాయిన్‌కు విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన కొందరు నిపుణులు కూడా ధ్రువీకరించారు.  దీనిపై మొబిక్విక్‌ స్పందించింది.

‘‘ సెక్యూరిటీ రీసెర్చర్లుగా చెప్పుకొనే వారు కొందరు మీడియాతో కలిసి వండివార్చిన ప్రచారం విలువైన మా కంపెనీ సమయాన్ని వృథా చేస్తోంది. మేము ఆ అంశంపై తీవ్రంగా దర్యాప్తు చేయగా.. చివరికి ఏమీ లేదని తేలింది. మా వినియోగదారులు, కంపెనీ డేటా పూర్తి సురక్షితంగా ఉంది’’ అని మొబిక్విక్‌  ప్రతినిధి తెలిపారు. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని