పెట్రోల్‌,డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ - agri cess on petrol diesel
close

Updated : 01/02/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌,డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌

దిల్లీ:  పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించినప్పటికీ వినియోగదారులపై ఎలంటి అదనపు భారం పడదని ఆర్థిక మంత్రి వివరించారు. ఎందుకంటే.. ఇతర పన్నులు తగ్గించడమే అందుకు కారణం.

‘పెట్రోల్‌, డీజిల్‌పై అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదు. వాటిపై బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీలు తగ్గించాం’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.

మద్యం ఉత్పత్తులపై 100శాతం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీలపై 40శాతం, కాబూలీ శనగలపై 30శాతం, శనగలపై 50శాతం, పత్తిపై 5శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఇవీ చదవండి...

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని