జేఈఈ విద్యార్థుల కోసం అమెజాన్‌ అకాడమీ - amazon india launches academy to help students prepare for jee
close

Published : 13/01/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేఈఈ విద్యార్థుల కోసం అమెజాన్‌ అకాడమీ

బెంగళూరు: ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌.. జేఈఈకి సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. అమెజాన్ అకాడమీ పేరిట ప్రారంభించిన ఈ వేదిక ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు, స్టడీ మెటీరియల్స్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా గణితం, రసాయనం, భౌతికశాస్త్రంపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నామని తెలిపింది.

అమెజాన్‌ అకాడమీ బీటా వెర్షన్‌ ప్రస్తుతం వెబ్‌తో పాటు గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ బిట్స్‌తో పాటు నిపుణుల సూచనలు, సలహాలతో బీటా వెర్షన్‌ అందుబాటులో ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన అధ్యాపకుల చేత కంటెంట్‌ రూపొందించినట్లు వెల్లడించాయి. ఈ మెటీరియల్‌ జేఈఈతో పాటు, విఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంఈఈఈ, ఎంఈటీకి సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా ఉపయోగపడనుందని పేర్కొన్నాయి. కొన్ని నెలల పాటు ఈ మెటీరియలంతా ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపాయి.

ఇవీ చదవండి..

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు! 

బుకింగ్‌ చేసుకున్న రోజే వంటగ్యాస్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని