అమెజాన్‌కు కొత్త సీఈఓ: షార్క్‌ అంత షార్ప్‌.. - amazon new ceo andy jassys nick name chop
close

Updated : 08/02/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌కు కొత్త సీఈఓ: షార్క్‌ అంత షార్ప్‌..

ఆండీ జాస్సీ ముద్దుపేరు ఏదో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌కు మరోపేరు అన్నంతగా పెనవేసుకు పోయిన ఘనత ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జెఫ్‌ బెజోస్‌ది. ఐతే తను పక్కకు తప్పుకున్న అమెజాన్‌ను నడిపించేందుకు ఆండీ జాస్సీని రంగంలోకి దించటంతో.. కార్పొరేట్‌ ప్రపంచమంతా ఆయన పేరు మార్మోగిపోయింది. ఐతే కాబోయే అమెజాన్‌ సీఈఓ ఆండీకి ‘ఛాప్‌’ అనే ముద్దు పేరు ఉంది. ఈ పేరు ఆయనకు ఎందుకు వచ్చిందో తెలుసా.. 

షార్క్‌ అంత షార్ప్‌..

‘ఛాప్‌’ అనే ఇంగ్లీషు పదానికి.. కోసివేయటం, తెగనరకటం అనే అర్థం ఉంది. ఒక్క చుక్క రక్తాన్ని వంద మైళ్ల దూరం నుంచి కూడా పసికట్టే షార్క్‌ చేప లాగా.. మనం సన్నద్ధంగా లేని విషయాన్ని ఆండీ జాస్సీ పసికట్టగలడని ఆయనతో పనిచేసే ఉద్యోగులు అంటారు. ఎన్నో రోజులు శ్రమపడి, చర్చించాల్సిన అంశాలను గురించిన సమాచారాన్ని తయారుచేస్తే.. ఆ మెమోలను నిర్దాక్షిణంగా చీల్చి చెండాడటం ఆయన స్టైల్‌. ఈ విధంగా సమావేశాల సైజును, సమయాన్ని కోతకోయటంతో.. ఆండీ జాస్సీని ఛాప్‌ అని పిలుస్తుంటారు. తన ఉద్యోగుల పట్ల ఎంతో నమ్మకం ఉన్నా.. సమయాన్ని ఏ మాత్రం వృధా కానివ్వని ఈ లక్షణాన్ని ఇతర వ్యాపార దిగ్గజాలు ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే అంటారు.

ఇక ఆండీకి పేరు ఎందుకు వచ్చేందనేందుకు ఇంకో వాదన ప్రచారంలో ఉంది. అమెజాన్‌కు సంబంధించి అతి కీలక, విధానపరమైన విషయాలను చర్చించే ప్రతీ ఉన్నత స్థాయి సమావేశంలోనూ ఆండీ హాజరు తప్పనిసరి. సియాటెల్‌లోని అమెజాన్‌ ప్రధాన కేంద్రంలో ఈ విధమైన కీలక సమావేశాలు నిర్వహించే బోర్డ్‌ రూమ్‌ పేరు ‘ఛార్టర్‌ హౌస్‌ ఆఫ్‌ పర్మా’. దీనినే సంక్షిప్తంగా ఛాప్‌ అంటారట. ఆండీ జాస్సీ ఆధ్వర్యంలోనే వివిధ అంశాలపై  చర్చలు జరుగుతుంటాయి కాబట్టి ఆయనను కూడా ఛాప్‌ అనటం మొదలుపెట్టారట.

ఇవీ చదవండి..

 ఆర్బీఐతో దోస్తీ..

ఎస్‌బీఐ ఎడీడబ్యుఎంతో అన్ని బ్యాంకింగ్‌ సేవలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని