మొబైల్‌ యూజర్స్‌కి అమెజాన్‌ ప్రైమ్‌ బంపర్‌ ఆఫర్‌..! - amazon prime video announces offer for mobile users
close

Published : 13/01/2021 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొబైల్‌ యూజర్స్‌కి అమెజాన్‌ ప్రైమ్‌ బంపర్‌ ఆఫర్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో మొబైల్ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్‌ వీడియో అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ (ఎంఈ) పేరుతో ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో ఈ ఆఫర్‌ తీసుకొచ్చింది. జనవరి 13 తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్‌ 30 రోజుల పాటు ఉచితంగా ట్రయల్ చెయ్యొచ్చు. తర్వాత రూ.89తో రీఛార్జ్‌ చేసుకుంటే 6జీబీ డేటాతో 28 రోజుల పాటు స్టాండర్డ్‌ డెఫినిషన్‌ (ఎస్‌డీ) వీడియో క్వాలిటీతో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను ఆస్వాదించొచ్చు. మొబైల్ సింగిల్‌ యూజర్స్‌ కోసం ఈ ప్లాన్‌ తీసుకొచ్చినట్లు అమెజాన్‌ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌ అందిస్తున్న రూ. 199 మొబైల్ ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 

ఇదే కాకుండా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ యూజర్స్‌ కోసం మరో ఆఫర్ కూడా ప్రకటించింది. ఇందులో రూ. 131తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 రోజుల పాటు ఒకరి కన్నా ఎక్కువ మంది యూజర్స్‌ ఉపయోగించుకోవచ్చు. అలానే మొబైల్‌, టీవీ రెండింటిలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను చూడొచ్చు. కానీ అమెజాన్‌ ప్రైమ్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 129కే అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్స్‌ రూ.349తో రీఛార్జ్‌ చేసుకుంటే  28 రోజుల వ్యాలిడిటితో 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. అలానే రూ. 299తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో 1.5జీబీ రోజువారీ డేటాతో ప్రైమ్‌ వీడియో మొబైల్ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. 

ఇవీ చదవండి..

డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

CES 2021: శాంసంగ్‌ ప్రాసెసర్‌..గేమింగ్ ఛైర్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని