close
Array ( ) 1

తాజా వార్తలు

స్టాంప్‌ చట్టం సవరణలు జులై 1 నుంచి అమల్లోకి

దిల్లీ: భారతీయ స్టాంప్‌ చట్టం-1899కి చేసిన కొన్ని సవరణలు ముందుగా అనుకున్నట్లు 2020 ఏప్రిల్‌ 1 నుంచి కాకుండా 2020 జులై 1 నుంచి అమలు చేయనున్నామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. స్టాంప్‌ డ్యూటీ విధించే వ్యవస్థను హేతుబద్ధీకరించి సమన్వయం చేయడానికి, పన్ను ఎగవేతల్ని అరికట్టడానికి వీలుగా ఆర్థిక చట్టం-2019 ద్వారా ప్రభుత్వం స్టాంప్‌ చట్టం-1899కి కొన్ని సవరణలు చేసింది. వీటిని 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఈ సవరణలను జులై 1 నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.