కేంద్రాన్ని రూ.700 కోట్ల ప్రత్యేకసాయం కోరిన ఏపీ! - andhra pradesh has sought release of rs 700 crore says centre
close

Published : 22/03/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రాన్ని రూ.700 కోట్ల ప్రత్యేకసాయం కోరిన ఏపీ!

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి వెల్లడి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని రూ.16,467 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అడిగాయని కేంద్రం సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, నాగాలాండ్‌ నుంచి అభ్యర్థనలు అందినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ రూ.700 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

పోర్చుగీసు వలస పాలన ముగిసి 60 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాల కోసం గోవా రూ.500 కోట్లు అడిగినట్లు ఠాకూర్‌ తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి పనుల కోసం మణిపూర్‌ రూ.14,567 కోట్లు, నాగాలాండ్‌ రూ.700 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం విజ్ఞప్తులు పంపినట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించి ఆర్థిక వనరుల లభ్యత మేరకు ప్రత్యేక గ్రాంట్ల కింద సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ-2014’ చట్టం కింద అందాల్సిన నిధులను నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

ఏపీలో ఒంటిపూట బడులు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని