విద్యుత్తు కారుకోసం హ్యుందాయ్‌, యాపిల్‌ జట్టు? - apple hyundai to agree on electric car tie up early this year
close

Published : 11/01/2021 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్తు కారుకోసం హ్యుందాయ్‌, యాపిల్‌ జట్టు?

ఇంటర్నెట్‌డెస్క్‌: అటానమస్‌ విద్యుత్తు కార్ల తయారీ కోసం దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ మోటార్స్‌, యాపిల్‌ ఐఎన్‌సీ జట్టుకట్టనున్నాయి.  మార్చి నాటికి వీరు డీల్‌ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2024 తొలి  అర్ధభాగం నుంచి అమెరికాలో వీటి ఉత్పత్తిని మొదలుపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ విషయాన్ని  కొరియా ఐటీ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది. ఇప్పటికే శుక్రవారం హ్యుందాయ్‌ కూడా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించింది. యాపిల్‌తో చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. దీంతో హ్యుందాయ్‌షేర్లు దాదాపు 20శాతం పెరిగాయి. 

ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కారును జార్జియాలోని కియా మోటార్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయాలని లేకపోతే సంయుక్తంగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలోని ప్లాంట్‌లో 2024లో లక్ష కార్ల వరకు ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ మొత్తం సామర్థ్యం ఏటా 4లక్షల కార్లుగాఉండే అవకాశం ఉంది.  కియా మోటార్స్‌ హ్యుందాయ్‌ అనుంబంధ సంస్థే. ఈ రెండు సంస్థలు కలిసి వచ్చే ఏడాది యాపిల్‌ కార్‌ బీటా వెర్షన్‌ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. కొరియా పత్రిక కథనంపై యాపిల్‌, హ్యుందాక్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 

ఇవీ చదవండి

ఇందుకా మేం పార్టీలకు విరాళాలిచ్చేది? 

ఈపీఎఫ్ఓలో బ్యాంక్ వివ‌రాలు అప్‌డేట్ చేసుకోండి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని